వంగవీటి కత్తి.. కాపు కాసే శక్తి.. తద్వారా విజయవాడలో రౌడీయిజం పుట్టిందని వాయిస్ ఓవర్ సాంగులో ఇండికేషన్ ఇస్తూ.. ''వంగవీటి'' సినిమా ట్రైలర్ ను ప్రారంభించాడు రామ్ గోపాల్ వర్మ. ఒక ముసలి లీడర్ ను స్కెచ్ వేసి లేపేసిన వెంటనే విజయవాడలో రౌడీయిజం పుట్టిందని ఆ స్కెచ్చేసి లేపేసేదే వంగవీటి రాధాకృష్ణ. అక్కడ నుండి అసలు విజయవాడ రౌడీయిజం పాలిటిక్స్ ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే కథ. ''రక్త చరిత్ర''కు ఏ మాత్రం తీసిపోని ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు ప్రకంపనాలు లేపుతోంది అనే చెప్పాలి.
ఇకపోతే ఈ కథలో మరో యాంగిల్ కూడా ఉందండోయ్. ''నా పేరు నెహ్రూ.. మా అన్నయ్య పేరు గాంధి'' అంటూ ఇద్దరు కుర్రాళ్లు ఆ ముసలాయన గ్యాంగులో చేరుతారు. బహుశా ఆ ముసలాయన పేరు వెంకటరత్నం ఏమో.. ఈ ట్రైలర్లో మనోడు ఎక్కడా చెప్పలేదులే. ఆ తరువాత నెహ్రూ అనే పాత్ర పేల్చిన ఒక డైలాగ్ మాత్రం మోస్ట్ కాంట్రోవర్షియల్ అయ్యే ఛాన్సుంది. ''మన ఇంట్లో ఒకడు తగ్గాడు కాబట్టి.. వాళ్ళ కుటుంబంలో కూడా ఒకడు తాగాలి'' అంటూ లెక్కలు చెబుతుంది ఆ పాత్ర. అలాగే రాధా తమ్ముడు రంగకు.. వాళ్ళావిడ ఇచ్చే సలహా.. ముందు నువ్వే చంపెయ్ రంగా.. అంటూ చెప్పడం కూడా షాకింగే.
మొత్తానికి ఇది రెండు సామాజిక వర్గాలకు చెందిన గొడవ.. ఒక ఊరికి చెందిన రౌడీయిజం.. రెండు పొలిటికల్ పార్టీలకు మచ్చలు తెచ్చే ఒక రక్తపు చరిత్ర అని వేరే చెప్పక్కర్లేదు. కాని రామ్ గోపాల్ వర్మ మాత్రం చాలా ధైర్యంగా ఈ ఎటెంప్ట్ చేశాడు. దాదాపు పాత్రలు చేసిన నటులందరూ ఒరిజినల్ విజయవాడ చరిత్రలోని మనుషులకు దగ్గరగా ఉన్నారు. సినిమా తాలూకు విజువల్స్ అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్ గా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకటే ప్రశ్న. అసలు సినిమా సెన్సారై విడుదలవుతుందా? అవ్వనిస్తారా? చేయగలుగుతారా?
Full View