హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి.. తమిళ బిగ్ బాస్ లో సందడి చేసిన వనితా విజయ్ కుమార్ మూడవ పెళ్లి గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా ఉన్న విషయం తెల్సిందే. ఆమె మూడవ వివాహం చేసుకున్న పీటర్ పాల్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ కొందరు సినీ ప్రముఖులు మరియు నెటిజన్స్ ఆమెను ప్రశ్నించారు. దాంతో ఆమె చాలా సీరియస్ అయ్యింది. తన వ్యక్తిగత విషయాల గురించి మీకు అనవసరం అంటూ తనపై విమర్శలు చేసిన వారిపై దుమ్మెత్తి పోసింది. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక గ్రామస్తుల మనో భావాలను దెబ్బ తీశాయి. దాంతో వారికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
తన మూడవ పెళ్లిని వనిత సమర్ధించుకుంటూ తన స్వస్థలం అయిన తంజావూరును ప్రస్థావించింది. నేను పుట్టిన స్వస్థలం అయిన తంజావూరులో రెండవ పెళ్లి అనేది చాలా సహజం. అక్కడ ఎంతో మంది రెండవ పెళ్లి చేసుకున్నారు. మా నాన్న కూడా రెండు పెళ్లిలు చేసుకున్నారు. అలాగే నేను కూడా కొన్ని కారణాల వల్ల మూడు పెళ్లిలు చేసుకోవాల్సి వచ్చింది. తంజావూరు సాంప్రదాయంను నేను పాటించానంటూ వింత వాదన చేసింది. ఆమె వ్యాఖ్యలపై తంజావూరు జనాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వల్ల తంజావూరు పరువు పోయిందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన మాటల వల్ల తంజావూరు ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నట్లయితే వారికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నా సోదర సోదరిమణులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కాదు. నా మాటల వెనుక ఎలాంటి ఉద్దేశ్యము లేదు. నా మాతృ భూమి అంటే నాకు ఎప్పటికి గౌరవం ఉంది. కొందరు నా మాటలను అనవసరంగా రాద్దాంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించింది. మూడు రోజుల క్రితం విపరీతమైన ట్రోల్స్ కారణంగా తన ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేసిన వనిత మళ్లీ అకౌంట్ ను యాక్టివేట్ చేసి అందులో పోస్ట్ లు పెడుతోంది. క్షమాపణలు చెప్పినా కూడా ఇంకా కొందరు వనితను ట్విట్టర్ ద్వారా టార్గెట్ చేస్తూనే ఉన్నారు.