కోలీవుడ్ పొమ్మంటే టాలీవుడ్ ర‌మ్మంది!

Update: 2023-02-15 10:03 GMT
విల‌న్ వేషాల‌తో టాలీవుడ్ లో అద‌ర‌గొడుతోంది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్. త‌మిళ అగ్ర‌న‌టుడు శ‌ర‌త్ కుమార్ వార‌సురాలిగా తండ్రిని మించిన త‌న‌య అని నిరూపిస్తోంది. వ‌ర‌ల‌క్ష్మికి ఒక ర‌కంగా త‌మిళంలో కంటే తెలుగులోనే ఫాలోయింగ్ అధికంగా ఉంది. ఈ బ్యూటీ నెగెటివ్ షేడ్ పాత్ర‌ల్లో ఎన‌ర్జిటిక్ న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేస్తుంటే త‌న‌కు తెలుగు చిత్ర‌సీమ వ‌రుస అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తోంది.

అందుకేనేమో టాలీవుడ్ పై త‌న ప్రేమ‌ను ఎంత మాత్రం దాచుకోలేదు వ‌ర‌ల‌క్ష్మి. త‌న‌కు తెలుగు సినిమాలో వ‌చ్చిన‌ట్టు కోలీవుడ్ లో అవ‌కాశాలు రావ‌డం లేదని టాలీవుడ్ త‌న‌ని ఆద‌రిస్తోంద‌ని కితాబిచ్చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన 'కొంటూనాల్‌ భవం' అనే క‌న్న‌డ చిత్రంలో న‌టించింది.

దయాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. మార్చి 3న విడుదల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో వ‌ర‌ల‌క్ష్మి పైవిధంగా వ్యాఖ్యానించింది. నేను ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటిస్తాను. నా తొలి ఆల్బమ్ 'బోడ బోడి' 2012లో తమిళంలో విడుదలైంది. 2022లో నా తెలుగు సినిమా 'క్రాక్' విడుదలైంది. ఆ ఏడాది తెలుగులో నాకు వచ్చిన స్పందన తమిళంలో రాలేదు. అక్క‌డ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పారితోషికం చర్చలకు లోబడి ఉంటుంది. అక్క‌డ‌ ప్రతిభను వారు గౌరవిస్తారు.

నేను న‌టిస్తే సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని వారు భావిస్తున్నారు. తెలుగు సినిమా తమిళం కంటే బాగా ఎక్స్‌పోజ్ అవుతోంది. నాకు చాలా అవకాశాలను నాన్ స్టాప్ గా ఇచ్చింది.. అని టాలీవుడ్ పై ప్రేమ‌ను కురిపించింది.

త‌మిళంలో గౌర‌వం పెరుగుతుంది:

'కొంటూనాల్‌ భవం' సినిమా త‌మిళ వెర్ష‌న్ కి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్నాను. తర్వాత తమిళంలో కూడా నాకు ప్ర‌త్యేక‌ గౌరవం లభిస్తుందని భావిస్తున్నాను. ఇందులో మల్లిక అనే పాత్రను పోషించాను. ఒకే రోజు ఒకే ఇంట్లో ఏం జ‌రిగింద‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఇది థ్రిల్లర్ చిత్రం. కథ 1980లో జరిగినప్పటికీ స్క్రిప్ట్ ఏ కాలంలో అయినా ఆద‌రించేదిగా ఉంది.

కన్నడలో ఈ చిత్రం ప్రజాదరణ పొందింది. తమిళంలోను ఆడుతుంద‌ని ఆశిస్తున్నాను.  నా పాత్ర ఇత‌ర‌ సినిమాల్లోలానే కొన్ని పాత్ర‌ల‌ను న‌డిపించే ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇలాంటి పాత్రల‌కు వ‌రుస‌గా న‌న్ను తీసుకోవడం మానుకోండి. అదే తారాగణంతో నేను తదుపరి చిత్రంలో కూడా కనిపించాను. అదనంగా కొన‌సాగింపు భాగం పూర్తయ్యే వరకు చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనాల్సి ఉంటుంది'' అని తెలిపింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News