నా కోసం రాధిక ఆంటీతో అమ్మ మాట్లాడింది : వరలక్ష్మి శరత్‌ కుమార్‌

Update: 2022-11-14 02:30 GMT
తమిళ స్టార్‌ శరత్‌ కుమార్‌ యొక్క నట వారసురాలిగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. శరత్‌ కుమార్‌ ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించినట్లుగానే వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కూడా విభిన్నమైన పాత్రల్లో నటించి నటిగా మంచి పేరును దక్కించుకుంటున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గానే కాకుండా విలన్ రోల్స్ ను కూడా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది.

హీరోయిన్ గా వరలక్ష్మి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాకుండా తండ్రికి తగ్గ కూతురు అనిపించుకునేందుకు నటిగా అద్భుతమైన పాత్రల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ పాత్రల్లో వరలక్ష్మి చేసిన సినిమాలు మరియు పాత్రలు నిలిచి పోయేలా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన తండ్రి శరత్‌ కుమార్‌ తల్ల నుండి విడాకులు తీసుకున్న సమయంలో నేను చెల్లి వారి యొక్క నిర్ణయాన్ని గౌరవించాం. మా కోసం వారిద్దరు కష్టంగా కలిసి ఉండాలని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది.

శరత్‌ కుమార్‌ ఆ తర్వాత రాధిక ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. రాధిక ఆంటీ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి అంటూ వరలక్ష్మి పేర్కొంది. నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు నాన్న అందుకు నిరాకరించాడు. అయితే అమ్మ ఆ విషయం లో నన్ను సమర్థించింది. నాకు మద్దతుగా నిలిచింది.

నాన్న ఒప్పుకోవడం లేదు అంటూ అమ్మ తో చెప్పిన సమయంలో స్వయంగా అమ్మ రాధిక ఆంటీకి ఫోన్ చేసింది. అమ్మ మొదటి సారి రాధిక ఆంటీ తో మాట్లాడింది. వరూ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకుంటుంది.. ఆయన వద్దు అంటున్నారు, ఒప్పించాలంటూ చెప్పిన సమయంలో మాట్లాడుదాం రండీ అంటూ అమ్మతో రాధిక ఆంటీ అన్నారు.

నేను అమ్మ మరియు రాధిక ఆంటీ నాన్న సెట్‌ లో ఉండగా వెళ్లాము. అప్పుడు మా ముగ్గురిని అక్కడ చూసి నాన్న షాక్ అయ్యారు. అమ్మ మరియు రాధిక ఆంటీ చెప్పడంతో నాన్న నేను సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పారు. నా కోసం అమ్మ రాధిక ఆంటీ తో మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయని వరలక్ష్మి చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News