తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్నప్పటికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న సినిమా వారసుడు. ఈ సినిమా ను తెలుగు లోనే నిర్మిస్తున్నాం అంటూ దిల్ రాజు పదే పదే చెప్పినా కూడా ఒక డబ్బింగ్ సినిమా అన్నట్లుగానే తెలుగు ప్రేక్షకులతో పాటు చాలా మంది భావిస్తున్నారు.
మరో వైపు తమిళ్ ప్రేక్షకులు వారసుడు సినిమా ను తెలుగు సినిమా గా భావిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. సాదారణంగా విజయ్ సినిమా అంటే తమిళనాట దక్కే క్రేజ్ దక్కలేదు. సరే తెలుగు రాష్ట్రాల్లో అయినా కుమ్మేస్తుంది అనుకుంటే ఇక్కడ కూడా పరిస్థితి పెద్దగా వారసుడు సినిమాకు పాజిటివ్ గా లేదు. ఈ నేపథ్యంలో వారసుడు పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారిందంటూ తమిళ మీడియా కథనాలు వస్తున్నాయి.
సంక్రాంతికి వారసుడు సినిమా ఇక్కడ అక్కడ భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ తమిళనాట అజిత్ హీరోగా నటిస్తున్న తునివు సినిమాకు మెజార్టీ థియేటర్లు దక్కబోతున్నాయి.
అందుకు కారణం ఆ సినిమా పంపిణీ హక్కులను పెద్ద చేయి ఒకటి తీసుకుంది. దాంతో వారసుడు కు అక్కడ ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కకపోవచ్చు అంటున్నారు.
ఇక సంక్రాంతికి డబ్బింగ్ సినిమా లకు థియేటర్లు ఇచ్చేది లేదు అంటూ వారసుడు సినిమాకు తెలుగు సినిమా నిర్మాతల మండలి ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వారసుడు సినిమా అక్కడ మరియు ఇక్కడ కాకుండా అవుతుందా అంటూ విజయ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ విపత్కర పరిస్థితి నుండి వారసుడు సినిమా ఎలా బయట పడుతుంది అనేది చూడాలి. ఒక వేళ సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయక పోతే కచ్చితంగా నిర్మాణ సంస్థ పై విజయ్ అభిమానులు రెచ్చి పోయి సోషల్ మీడియా ద్వారా రచ్చ చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక దిల్ రాజు తన చతురత ఉపయోగించి ఏం చేస్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.