వారిసు బాక్సాఫీస్.. ఫస్ట్ డే ఎంత వచ్చాయంటే?

Update: 2023-01-12 09:13 GMT
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారిసు సినిమా బుధవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ థియేటర్ల సమస్య వలన నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో వాయిదా వేసుకోక తప్పలేదు.

జనవరి 14వ తేదీన తెలుగులో రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలఊగున్న విషయం తెలిసిందే. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా టోటల్ గా 137.9 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. విజయ్ రేంజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదయ్యాయి. సినిమా విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా మొదటి రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే అసలు తగ్గలేదు.

ఇక మొదటి రోజు ఈ సినిమా తమిళనాడులో 20.15 కోట్ల వరకు సొంతం చేసుకుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయలేదు. ఇక కర్ణాటకలో అయితే 5.62 కోట్లు కేరళలో 4.55 కోట్లు ఇక మిగిలిన రాష్ట్రాల్లో అయితే 1.15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. విజయ్ సినిమాకు ఈసారి మిగతా రాష్ట్రాలలో మంచి కలెక్షన్స్ రావడం విశేషం. ఓవర్సీస్ నుంచి 14.85 కోట్లు వచ్చాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే విజయ్ సినిమా 46.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ 23.60 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. విజయ్ గత సినిమాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువ అయినప్పటికీ కూడా సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి మంచి ఒపెనింగ్స్ అయితే సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద 137.90 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కాబట్టి 139 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ అయింది. అంటే సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 115.40 కోట్ల షేర్ కలక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News