వర్మ నీకు ఇదేం బుద్ది బాబు?

Update: 2021-01-12 06:45 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన చేస్తున్న సినిమాలతో నలుగురికి జీవనోపాది లభిస్తుందని ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఎక్కువ మందికి ఆయన ఉపాది కల్పించినట్లుగా అవుతుంది అంటూ ఆమద్య కరోనా సమయంలో వర్మపై ప్రశంసలు కురిశారు. కరోనా సమయంలో అంతా షూటింగ్‌ లకు దూరంగా ఉంటే వర్మ మాత్రం షూటింగ్‌ చేసి కొద్ది మంది సినీ కార్మికులకు అయినా అండగా నిలిచాడు అనేది చాలా మంది అభిప్రాయం. వర్మ గురించి ఉన్న ఈ సదాభిప్రాయం తప్పు అంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్ చెప్పుకొచ్చింది. 

తమ ఫెడరేషన్‌ కు చెందిన 32 యూనియన్లకు చెందిన టెక్నీషియన్స్‌ కు వర్మ దాదాపుగా కోటి రూపాయలు బాకీ ఉన్నాడు అని ప్రెసిడెంట్‌ బీఎన్‌ తివారీ అన్నారు. వర్మ ఎంతో కాలంగా చాలా మంది టెక్నీషియన్స్‌ కు ఇవ్వాల్సిన పారితోషికాల విషయంలో జాప్యం చేస్తూ వస్తున్నాడు. వారికి చెల్లించాల్సిన మొత్తంను చెల్లించాల్సిందిగా ఇప్పటికే పలు సార్లు ఆయనకు నోటీసులు పంపించడం జరిగింది. వాటికి సమాధానం ఇవ్వక పోగా టెక్నీషియన్స్‌ కు బకాయిలు చెల్లించలేదు. దాంతో ఆయనపై లీగల్ గా వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. 

వర్మ ఇలా సినీ కార్మికుల బకాయిల విషయంలో ఆలస్యం చేయడం.. సినీ కార్మికులకు సంబంధించిన పారితోషికాలను ఇవ్వక పోవడం సరైన పద్దతి కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వర్మకు ఇలాంటి బుద్ది ఉన్నట్లుగా తాము ఊహించలేదు అంటూ కొందరు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలంటూ వర్మను నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. 


Tags:    

Similar News