'స‌ర్కార్' వివాదంపై దిన‌క‌రన్ షాకింగ్ కామెంట్స్!

Update: 2018-11-08 17:16 GMT
ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ దాస్ - ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ ల కాంబోలో వ‌చ్చిన `స‌ర్కార్`చిత్రం పై వివాదం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో లేడీ విల‌న్ గా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర....దివంగత ముఖ్యమంత్రి జయలలితను పోలి ఉందంటూ ఏఐడీఎంకే ఆరోపిస్తోంది. జయలలిత అసలు పేరు కోమలవల్లి అని...వ‌ర‌ల‌క్ష్మి క‌ట్టుబొట్టు కూడా జయలలితని పోలి ఉన్నాయ‌ని ఏఐడీఎంకే నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాకుండా - జయలలిత ప్రవేశ పెట్టిన ఉచిత పథకాలపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించార‌ని - సినిమాలో ఆ అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు తొలగించ‌కుంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆ వ్య‌వ‌హారంపై ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి కాదని - 2003లో అలా ప్రచారం జరిగిందని ఆయ‌న వెల్ల‌డించారు.

2003లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత‌...జయలలితను ఉద్దేశించి కోరమరవల్లి అంటూ విమర్శలు గుప్పించారని దిన‌క‌రన్ గుర్తు చేశారు. ఆనాడు త‌న‌తో జయలలిత మాట్లాడార‌ని - తాను కోర‌మ‌ర‌వ‌ల్లి అనే పాత్రలో తాను న‌టించలేదని చెప్పార‌ని గుర్తు చేసుకున్నారు. ఆ నేత తనను ఆ పేరుతో ఎందుకు పిలిచారో అర్థం కాలేద‌ని త‌న‌తో అన్నార‌ని వెల్ల‌డించారు. జయలలిత అసలు పేరు కూడా కోమరవల్లి కాదని - అన్నాడీఎంకే నేతలు `సర్కార్ ` చూడ‌కుండానే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని ఆరోపించారు. ఆ విష‌యాల‌పై అవగాహన లేకుండా వారు మాట్లాడుతున్నార‌ని, అందువ‌ల్ల వారి గురించి ఎక్కువ‌ మాట్లాడటం స‌రి కాదని అన్నారు. జయలలితను కించపరిచే సన్నివేశాలు ఆ సినిమాలో లేవని దినకరన్ అభిప్రాయ‌ప‌డ్డారు.



Tags:    

Similar News