కరణ్‌ జోహార్‌ రేంజి ఇలా పడిపోయిందేంటి?

Update: 2015-05-26 19:30 GMT
మన రామ్‌గోపాల్‌ వర్మ కరణ్‌ జోహార్‌ను చాలా తేలిగ్గా తీసి పారేస్తాడు కానీ.. బాలీవుడ్‌లో అతడి రేంజేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కరణ్‌ తన దర్శకత్వంలో తీసినా.. నిర్మించినా.. ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది. అందరూ కొత్త వాళ్లతో తీసిన 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌' కూడా 80 కోట్ల దాకా కలెక్ట్‌ చేసిందంటే అది కేవలం కరణ్‌ జోహార్‌ ఘనతే. దీనికి ముందు కరణ్‌ తీసిన బ్లాక్‌బస్టర్ల గురించి చెప్పుకుంటే చాలానే ఉంది. ఐతే కొన్నేళ్లుగా కరణ్‌ నిర్మాణానికే పరిమితమవుతున్నాడు. ఎప్పుడో కానీ.. మెగా ఫోన్‌ పట్టట్లేదు. ఐతే మూడేళ్లుగా ఓ ప్రాజెక్టు గురించి కలలు కంటున్నాడు కరణ్‌. అదే.. శుద్ధి.

ముందు హృతిక్‌ రోషన్‌, కరీనా కపూర్‌లతో ఈ సినిమా తీయాలనుకున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రణాళికలు వేసుకుని.. షూటింగ్‌ మొదలుపెట్టబోతుండగా ఏవో కారణాలతో హృతిక్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో కరీనా కపూర్‌ను కూడా పక్కనబెట్టేసి రణవీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలతో ఈ సినిమా తెరకెక్కించాలని చూశాడు కరణ్‌. కానీ ఆ జంట కూడా కుదర్లేదు. తర్వాత సల్మాన్‌ను హీరోగా ఎంచుకున్నట్లు ప్రకటించాడు. దీంతో మళ్లీ ఈ ప్రాజెక్టుకు క్రేజ్‌ వచ్చింది. కానీ ఇప్పుడు సల్మాన్‌ పక్కకెళ్లిపోయి.. కొత్త హీరో లైన్లోకి వచ్చాడు. 'శుద్ధి'లో హీరో వరుణ్‌ ధావన్‌ అట. హీరోయిన్‌గా ఆలియా భట్‌ను ఎంచుకున్నాడట. స్వయంగా ఈ విషయాన్ని కరణే ప్రకటించాడు. ఐతే ఎంతో ఆసక్తి రేపిన 'శుద్ధి' ప్రాజెక్టులో హృతిక్‌, సల్మాన్‌లో ఎవరో ఒకరు ఉండుంటే దాని రేంజే వేరుగా ఉండేది. వరుణ్‌ ఈ మధ్య సినిమా సినిమాకు ఎదుగుతున్నప్పటికీ కరణ్‌ కలల ప్రాజెక్టుకు సరిపోతాడా అనేది సందేహం. వరుణ్‌ను ఎంచుకోవడం ద్వారా తన రేంజినే కాదు.. సినిమా రేంజిని కూడా తగ్గించేశాడు కరణ్‌.

Tags:    

Similar News