యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరైన ట్రాక్ లో ప్రయాణం చేస్తున్నాడు. జాగ్రత్తగా ఎంచుకుంటున్న కథలు దర్శకులు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాలు వచ్చేలా చేస్తున్నాయి. అందుకే ప్రతి సినిమాకు మధ్య ఏడాది దాకా గ్యాప్ వస్తున్నా దాన్ని తారక్ లెక్క చేయటం లేదు. తొందరపడి డిజాస్టర్ చేయటం కన్నా కాస్త ఆలస్యం అయినా బ్లాక్ బస్టర్ లో నటించడమే మేలనే సూత్రాన్ని ఫాలో అవుతూ మాంచి జోరు మీదున్నాడు. ప్రస్తుతం అరవింద సమేత వీర రాఘవ కోసం బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత రాజమౌళి మల్టీ స్టారర్ కోసం చరణ్ తో కలిసి జాయిన్ అవుతాడు. నాన్నకు ప్రేమతోనే పాతిక సినిమాలు పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక్క వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది. అదే బాలీవుడ్ ఎంట్రీ. హిట్టో ప్లాపో ఒక్క సినిమా అయినా అక్కడ ట్రై చేయటం చిరంజీవి మొదలుకుని చరణ్ దాకా అందరు చేసారు. కొందరు సక్సెస్ చూసారు. ఇంకొందరు ఫెయిల్యూర్ అందుకున్నారు. బాహుబలితో ప్రభాస్ ఏకంగా నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అటువైపుగా ఎప్పుడు ఆలోచించలేదు.
కానీ ఇటీవలే హిందీ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ కొత్త సందేహాలను రేపుతున్నాయి. యుద్ధ నేపధ్యంలో శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించనున్న రణ్ భూమి త్వరలో ప్రారంభించనున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో ఫాన్స్ తో ముచ్చటించాడు వరుణ్ ధావన్. ఈ సందర్భంగా తారక్ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా తాను కూడా యంగ్ టైగర్ ఫ్యాన్ అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు రణ్ భూమిలో జూనియర్ ఉంటాడా అన్న ప్రశ్నకు ఇలాంటివి తన దర్శకుడిని అడగాలి కానీ తనను కాదని చెప్పి మరో షాక్ ఇచ్చాడు. నిజానికి తారక్ ఉండొచ్చు అనే ఆలోచనే లేకపోతే లేడు అని నేరుగా చెప్పేయొచ్చు. అలా కాకూండా దర్శకుడిని అడగండి అంటే ఊహాగానాలకు తెరలేపినట్టే. యుద్ధ నేపధ్యంలో అత్యంత భారీగా రూపొందనున్న రణ్ భూమి 2020లో విడుదల అవుతుంది. బాహుబలి స్థాయి సినిమా తీయాలన్న చిరకాల కోరిక కరణ్ జోహార్ ఈ సినిమా ద్వారా తీర్చుకోబోతున్నాడని బాలీవుడ్ కథనం.