ట్రైలర్ టాక్: ప్రేమ కోసం చెప్పే కథ

Update: 2018-03-12 17:40 GMT
ఈ రోజుల్లో వెండితెరపై వచ్చే చాలా ప్రేమ కథలు దాదాపు 90% ఒకేలా ఉంటాయనేది అందరికి తెలిసిందే. ప్రేమ కోసం ప్రేమికులు - సమస్యలు - విజయం లేదా మరణం. ఇదే పద్ధతి నడుస్తోంది. ప్రేమలో అన్ని రంగులు కలగలిపిన భావాలను ఆస్వాదించేశం. అయినా కూడా ఏడాదిలో విడుదలయ్యే 70% శాతం సినిమాలు ప్రేమ కథలే. కానీ కథ ఒకటే అయినా కూడా తెరకెక్కించే విధానం కొత్తగా ఉంటే సినిమాను ఇష్టపడివారే సంఖ్య ఎక్కువే.

ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి కష్టాలు ఉన్నాయి. కష్టం అనే పదం అందరు వాడతారు. కానీ కష్టపడే విధానం సమస్యలు వేరేగా ఉంటాయి. రీసెంట్ గా అదే తరహాలో ఓ సినిమా తెరకెక్కింది అని చిత్ర యూనిట్ చెబుతోంది. మనం చాలా ప్రేమ కథలని చూశాం. కానీ ప్రేమ గురించి ఈ సినిమా అని అక్టోబర్ అనే సినిమా వారు ట్రైలర్ ద్వారా చెబుతున్నారు. కష్టల్లో ఉండే హీరో హీరోయిన్ సమస్యని ఎలా ఎదుర్కొన్నారు అనేదే అసలు కథ. ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. కొంచెం షాపింగ్ మాల్ కాన్సెప్ట్ ని తిప్పేసి కొట్టినట్లు అనిపిస్తోంది.

బాలీవుడ్ లో ఇప్పుడిపుడే బాక్స్ ఆఫీస్ స్టార్ హీరోగా ఎదుగుతోన్న వరుణ్ ధావన్ కి సినిమాలో కథానాయకుడు. గత ఏడాది జూడ్వా 2 తో 200 కోట్లను కొల్లగొట్టిన వరుణ్ ఈ సారి మాత్రం సింపుల్ గా లవ్ స్టోరీతో వస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. మద్రాస్ కేఫ్ - విక్కీ డోనర్ - పికు వంటి డిఫెరెంట్ సినిమాలను నిర్మించిన ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాను నిర్మించడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అక్టోబర్ సినిమా ఏప్రిల్ 13న రిలీజ్ కానుంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News