బాలీవుడ్ కు అంటగట్టేస్తున్నారా?

Update: 2017-09-05 07:05 GMT
మార్కెటింగ్ తెలిస్తే చాలు.. మామూలు రాయిని కూడా మణిపూస అని చెప్పి నమ్మించి అమ్మేయొచ్చు. మిగతాచోట్ల కన్నా సినిమా ఇండస్ట్రీలో ఈ గారడీ కాస్తంత ఎక్కువే పని చేస్తోంది. ఇలాంటి కథ ఇంతకుముందెప్పుడూ వెండితెరపై రాలేదనే మాట చాలా మంది చెబుతూనే ఉంటారు. కానీ తెరపై మాత్రం రొటీన్ సినిమాల్లోని కంటెంటే.

బాహుబలి హిట్ తర్వాత బాలీవుడ్ మొత్తం తెలుగు సినిమా వైపు ఆసక్తిగా చూస్తోంది. మనోళ్ల జడ్జిమెంట్ మీద హిందీ వాళ్లకూ కాస్త నమ్మకం కలిగింది. రైటర్ కోన వెంకట్ దీనిని బాగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇటీవల నాని హీరోగా నటించిన నిన్ను కోరి సినిమాకు కోన స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశాడు. నానికున్న క్రేజ్ వల్ల ఈ సినిమా బాగానే ఆడింది. అయితే ఇది తెలుగులో సూపర్ డూపర్ హిట్ అని నమ్మించి హిందీ సినీ జనాలకు అంటగట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వరుణ్ ధావన్ తో ఈ సినిమా తీయాలని ప్రయత్నాలు  జరుగుతున్నాయి. ఇంతకుముందు శ్రీదేవి హీరోయిన్ గా నటించిన మామ్ సినిమాకు కోన వెంకట్ కథ అందించాడు. అదో అద్భుతమైన కథగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను నమ్మించడంతో సినిమా తీసినా చివరకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు వరుణ్ ధావన్ కూడా కోన మార్కెటింగ్ మాయలో పడతాడేమో చూడాలి.

నిన్ను కోరి రొమాంటిక్ ఎంటర్ టెయినర్ అయినప్పటికీ సినిమాలో స్టోరీకన్నా యాక్టర్ల టాలెంట్ వల్లనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా నెగిటివ్ క్లైమాక్స్ అయినా నాని - నివేదాల డీసెంట్ నటన మూలంగా ఈ సినిమా నష్టాల పాలవకుండా బయటపడగలిగింది. మరి బాలీవుడ్ జనాలు ఈ విషయం గమనించి ముందడుగు వేస్తారో.. లేక సినిమా ఆడిందన్న ఉబలాటంతో ముందుకెళ్తారో.. వేచి చూడాలి మరి?
Tags:    

Similar News