దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చిన వరుణ్ ధావన్.. ఇప్పటికే మంచి సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. గతేడాది వచ్చిన జుడ్వా2 చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి.. ఈ హీరో స్థాయిని మరింతగా పెంచింది. అక్టోబర్ అంటూ ఈ హీరో చేసిన లేటెస్ట్ మూవీ.. ఏప్రిల్ 13న థియేటర్లలోకి వస్తోంది.
అక్టోబర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న వరుణ్ ధావన్.. తనకు దక్షిణాది సినిమాల్లో చేయాలని ఆసక్తిగా ఉందనే విషయం చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తెలుగు సినిమాలు తనను విపరీతంగా ఆకర్షిస్తున్నట్లు చెప్పాడు ఈ బాలీవుడ్ హీరో. 'నేను శంకర్.. రాజమౌళి వంటి దర్శకులతో పని చేయాలని కోరుకుంటున్నాను. నిజానికి నేను ఓ తమిళ్ సినిమాతో కానీ.. తెలుగు సినిమాతో కానీ హీరోగా అరంగేట్రం చేయాల్సి ఉంది. రామ్ చరణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. తెలుగు నేర్చుకోమని నాకు సలహా ఇచ్చాడు. దక్షిణాది సినిమాలు చూడడం నాకు భలే ఇష్టం. వారి టేస్ట్ లు నాకు నచ్చుతాయి' అని చెప్పాడు వరుణ్ ధావన్.
అర్జున్ రెడ్డి.. మెర్క్యురీ వంటి చిత్రాలు చూస్తే సౌత్ సినిమాల స్టేటస్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తుందన్న వరుణ్ ధావన్.. ఇక కంటెంట్ విషయంలో కింగ్ అంటే మాత్రం మలయాళ సినిమానే అన్నాడు. సౌత్ సినిమాల్లో చేయడం వరకూ ఓకే కానీ.. నేరుగా రాజమౌళికి.. శంకర్ కు గురి పెట్టేస్తే.. టార్గెట్ ను అందుకోవడం కష్టమవుతుందేమో వరుణ్.. కాస్త ఆలోచించు.