వరుణ్ తేజ్ తొమ్మిదో తరగతి ప్రేమ

Update: 2018-02-10 04:56 GMT
మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన సినిమాల్లో అతడికి మంచి పేరు తెచ్చింది ప్రేమ కథలే. తొలిచిత్రం ముకుంద నుంచి లేటెస్ట్ హిట్ ఫిదా వరకు అతడి సినిమాలకు కమర్షియల్ గా కలిసొచ్చిందీ ప్రేమ కథలకే. అందుకే లేటెస్ట్ గా మరో ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హీరోయిన్ రాశీఖన్నాతో తొలిప్రేమ మధురిమను ప్రేక్షకులకు పంచడానికి రెడీ అయిపోయాడు.

మంచి లవ్ స్టోరీస్ చేసుకుంటూ వరుణ్ తేజ్ ను జీవితంలో తొలిప్రేమ ఎప్పుడు పలకరించిందని ప్రశ్నిస్తే స్కూల్ డేస్ లోనే ఆ అనుభూతి ఎదురైందని అంటున్నాడు. ‘‘నేను భారతీయ విద్యాభవన్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులవి. అప్పట్లో ఓ అమ్మాయి తో పరిచయం ఏర్పడింది. నాకేమో అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గు ఎక్కువ. అందుకే నేను పెద్దగా మాట్లాడలేక పోయేవాడిని. ఆ అమ్మాయే చొరవగా మాట్లాడింది. తన ఫోన్ నెంబరూ ఇచ్చింది. తరవాత కొన్నాళ్లు టచ్ లో ఉన్నాం.. ఆ తరవాత ఎవరిదారి వారిదే. ఇది ప్రేమలాంటిదే.. కానీ ప్రేమకాదు’’ అంటూ తన తొలి ప్రేమను గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చాడు.

‘‘తొలి ప్రేమ బాబాయ్ కెరీర్ లో చాలా స్పెషల్. ఆ సినిమా టైటిల్ పెట్టాం కానీ ఆ కథకు.. ఈ కథకకు పోలికే ఉండదు. ఆ జనరేషన్ లో అమ్మాయితోనే మాట్లాడాలంటేనే భయపడేవారు. చూసీ చూడంగానే ప్రపోజ్ చేస్తున్న రోజులివి. రాశీఖన్నా తొలిసినిమా ఊహలు గుసగుసలాడే మంచి ప్రేమకథ. అందులో  చాలా బాగా నటించింది. అందుకే ఆమెను ఈ సినిమాకూ తీసుకున్నాం’’అంటూ తన లేటెస్ట్ సినిమా విశేషాలు పంచుకున్నాడు వరుణ్ తేజ్.
Tags:    

Similar News