అబ్దుల్ కలామ్ ఊర్లో అంతరిక్షం జంట

Update: 2018-07-31 07:52 GMT
మెగా హీరో వరుణ్ తేజ్ రెండు హిట్లతో మంచి ఫామ్ లోకి  వచ్చాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కే చిత్రం ఒకటి, విక్టరీ వెంకటేష్ తో చేస్తున్న 'F2' మల్టిస్టారర్ మరొకటి.

సంకల్ప్ రెడ్డి సినిమాలో హీరోయిన్ అదితి రావు హైదరీ.  'అంతరిక్షం' అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి కదా.  ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా తమిళ నాడు లోని రామేశ్వరంలో జరిగింది.  భారత మాజీ రాష్ట్రపతి ఎ పీ జె అబ్దుల్ కలామ్ సొంత ఊరు రామేశ్వరం అనే విషయం అందరికీ తెలిసిందే.  అక్కడ కలామ్ చదువుకున్న బడిలో షూటింగ్ జరిగిందట.   అదితి అక్కటి షూటింగ్ స్టిల్ ను ఒకదాన్ని రీసెంట్ గా షేర్ చేయడం జరిగింది.  వరుణ్ తేజ్- అదితి రావు ఆ ఫోటో లో స్కూల్ బెంచిలపై కూర్చొని నవ్వుతూ ఉన్నారు.

ఈ సినిమా స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందనన్న విషయం తెలిసిందే. అందుకే స్పేస్ రీసెర్చ్ లో ఎన్నో ఘనతలు సాధించిన అబ్దుల్ కలామ్  సొంత ఊరైన రామేశ్వరంలో షూటింగ్ చేయడం ద్వారా సంకల్ప రెడ్డి సూపర్ టచ్ ఇచ్చాడు.
Tags:    

Similar News