ఆరున్నర అడుగుల ఆజానుభాహుడు.. గ్రీకువీరుడి స్ఫురద్రూపం.. టాలీవుడ్ లో ఎవరికి ఉంది? అంటే టకీమని వరుణ్ తేజ్ పేరు చెప్పేస్తారు. మహేష్, ప్రభాస్, రానా తర్వాత టాల్ & ఛామింగ్ హీరోగా వరుణ్ తేజ్ రూపం గుర్తుంటుంది. ముకుంద సినిమాతో కెరీర్ ప్రారంభించిన వరుణ్ తేజ్ ప్రారంభమే ప్రయోగంతో తన రూటు సపరేటు అని నిరూపించాడు. ఆ తర్వాత కంచె, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం వంటి చిత్రాలతో అసలు ఒకదానితో ఒకటి సంబంధం లేని ప్రయోగాలు చేశాడు. ప్రయోగాల బాటలో కొన్నిసార్లు (మిస్టర్, అంతరిక్షం) విఫలమైనా, వెంటనే తనని తాను విశ్లేషించుకుని చక్కని ఎంపికలతో దూసుకెళుతున్నాడు. తాజాగా `ఎఫ్ 2` చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ ని అందుకుని సత్తా చాటాడు. అసలు వరుణ్ తేజ్ కామెడీ చేయగలడా? అని భావించిన వారికి నైజాం యాసలో.. లుంగీ పంచెలో మాస్ టచ్ ఇచ్చి మెప్పించాడు.
19 జనవరి 1990 వరుణ్ తేజ్ పుట్టిన రోజు. నేటితో 28వ వసంతంలోకి అడుగుపెట్టాడు ఈ యంగ్ హీరో. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో మెగా ప్రిన్స్ కు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలిపారు. అన్న రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ ఫోటోని ట్రెండ్స్ చరణ్ టీమ్ (ఫ్యాన్స్) షేర్ చేయడం విశేషం. ఇకపైనా వరుణ్ తేజ్ ప్రయోగాలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్, అన్నయ్య రామ్ చరణ్ స్ఫూర్తితో వరుణ్ తేజ్ టాలీవుడ్ లో పెద్ద స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. `ఎఫ్ 2` తర్వాత వరుణ్ తేజ్ నటించే సినిమాకి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందింకా. ప్రస్తుతం కొన్ని స్క్రిప్టు దశలో ఉన్నాయని ఇదివరకూ చెప్పాడు. `అంతరిక్షం` చిత్రం విఫలం అయినప్పుడు .. తప్పు చేసినా, అభిమానులకు నచ్చని పని చేసినా సరి చేసుకుని ముందుకు వెళతానని వినమ్రంగా చెప్పాడు కాబట్టి.. ఒదిగి ఉండే ఈ మెగా హీరోకి చక్కని కెరీర్ ఉందనే చెప్పొచ్చు. ప్రయోగాలు అనేకంటే.. తనకు కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఉందని పదే పదే చెబుతున్నాడు. దీనిని బట్టి వరుణ్ తేజ్ నుంచి మరింత క్రియేటివ్ స్టఫ్ ఉన్న ప్రయోగాల్ని అభిమానులు ఆశించవచ్చు. నేడు బర్త్ డే జరుపుకుంటున్న మెగా ప్రిన్స్ కి అభిమానుల తరపున శుభాకాంక్షలు.
Full View