వరుణ్ తేజ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికి మూడు సినిమాలు చేసి, విభిన్నమైన క్రేజ్ సంపాదించాడు. ముకుంద - కంచె - లోఫర్ లతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నాగబాబు తనయుడు.
పేరు సంపాదించినా.. కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. పైగా స్టార్ స్టేటస్ కి రీచ్ కాలేకపోతున్నాడనే టాక్ ఉంది. ఇప్పుడు కూడా రాయబారి సహా మరో రెండు ప్రాజెక్టులను క్యూలో పెట్టినా.. మెగా అభిమానుల నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ రాలేదు. మరి తన క్రేజ్ ను అమాంతం పెంచుకునేందుకు ఏం చేయాలనే ఆలోచించిన మెగా క్యాంప్.. ఓ పవర్ ఫుల్ ఐడియా వేసినట్లు తెలుస్తోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించేలా చేయడం. ఒకసారి కనుక.. వరుణ్ తేజ్ పవర్ స్టార్ సినిమాలో కనిపిస్తే, వచ్చే నేమ్ ఫేమ్ వేరుగా ఉంటాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్లు ప్లెడ్జెడ్ గా ఓన్ చేసుకునే అవకాశాలుంటాయి.
అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తన్న సర్దార్ గబ్బర్ సింగ్ ఓ చిన్న రోల్ చేయడానికి టాక్స్ ఓకే అయినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక నిమిషం పాటు మాత్రమే ఉండే రోల్ అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ పై పవన్ కు ఉన్న అభిమానంతో, దీనికి అంగీకరించాడట. ఈ వార్త నిజమే అయితే.. వరుణ్ తేజ్ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. నిజానికి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లలో రామ్ చరణ్ - అల్లు అర్జున్ లు.. పవన్ కళ్యాణ్ ను ఇలాంటి రిక్వెస్టులు చేయకుండానే ఎదిగారు. కానీ సాయిధరం తేజ్ - వరుణ్ తేజ్ లు మాత్రం అంత కాలం వెయిట్ చేయకుండా.. వీలైనంత త్వరగా స్టార్స్ అయిపోయేందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు చెప్పచ్చు.