మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ముకుంద - కంచె సక్సెస్ తో స్వింగులో ఉన్నాడు ఇప్పుడు. స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ తన కెరీర్ లో పెద్ద విజయం ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. అంతేకాదు .. కెరీర్ పరంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ కథల్ని ఎంచుకుంటున్న హీరోగా వరుణ్ తేజ్ కి ఐడెంటిటీ వచ్చింది.
ఇదే విషయంపై వరుణ్ ముచ్చటిస్తూ.. కంచె సినిమా విజయం సాధించడం ఎంతో కాన్ఫిడెన్స్ పెంచింది. జనాలు నవ్యపంథా సినిమాల్ని చూస్తున్నారు అన్న ఇండికేషన్ వచ్చింది. ఇలాంటి విజయాలతో కొత్తగా ప్రయత్నించాలన్న ఉత్సాహం వస్తుంది. మునుముందు మరిన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తాను. కమర్షియల్ సక్సెస్ సాధిస్తా.. అంటూ నమ్మకంగా చెప్పాడు వరుణ్ తేజ్. ఇక తన డైరెక్టర్లు క్రిష్ - పూరీ గురించి ముచ్చటిస్తూ .. ఇద్దరి శైలి వేరు కానీ, ఆన్ సెట్స్ ఇంచుమించు ఒకేలా ఉండే దర్శకులు వీళ్లు. పూరీ నటుడికి బోలెడంత స్కోప్ ఇచ్చి పనిచేయించుకునే వ్యక్తి. ఆన్ సెట్స్ చాలా ఫన్నీగా సాగిపోతుంది. నటుల నుంచి కొన్ని ఇన్ పుట్స్ కూడా అడిగి తీసుకుంటారు. అయితే క్రిష్ అలా కాదు. తనకి ఏం కావాలో అది ఎగ్జాక్ట్ గా అవతలివాళ్లు ఇవ్వాలని అనుకుంటాడు. ఈ ఇద్దరికీ మధ్య తేడా అదే.. అంటూ టాప్ సీక్రెట్ చెప్పేశాడు.
సినిమాల సంగతి సరే. ప్రేమలో పడలేదా అని అడిగితే.. హహ్హహ్మ.. అంటూ నవ్వేస్తూ.. అబ్బే అందుకు టైమే లేదండీ అంటూ తెగ సిగ్గు పడిపోయాడు ఈ మెగా హీరో. సినిమాల బిజీలో ఉండగానే ఎవరో ఒకరితో ప్రేమలో పడతావులే గురూ. అది ప్రకృతి సహజం.