మెగా బ్రదర్స్ వార్ తప్పదు

Update: 2018-11-05 17:30 GMT
సాధారణంగా ఏ సీజనైనా మెగా కాంపౌండ్ హీరోల సినిమాల విడుదల విషయంలో దాదాపు పోటీ ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. నేరుగా కాకపోయినా తక్కువ గ్యాప్ లో వచ్చేలా ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టు ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. మరీ తప్పదు అనుకున్న సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. ఆ మధ్య ఇంటెలిజెంట్-తొలిప్రేమ ఒకేసారి రిలీజ్ చేయాల్సి వస్తే అండర్ స్టాండింగ్ మీద వరుణ్ తేజ్ సినిమాను ఒకరోజు ఆలస్యంగా శనివారం విడుదల చేసారు. అనూహ్యంగా ఇదే పెద్ద హిట్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ ది వరస వేరు కాబట్టి ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు.

కానీ వచ్చే సంక్రాంతి మాత్రం మెగా బ్రదర్స్ స్ట్రెయిట్ ఫైట్ తప్పడం లేదు. రామ్ చరణ్ తేజ్-వరుణ్ తేజ్ ఇద్దరూ ఇప్పటి దాకా ఒకే సీజన్ లో తలపడలేదు. అలాంటి అవకాశం కూడా రాలేదు. చరణ్ తో పోల్చేంత మార్కెట్ వరుణ్ కు లేకపోవచ్చు కానీ అండగా వెంకటేష్ తో పాటు దిల్ రాజు ఉన్నాడు. కాబట్టి హైప్ పరంగా విడుదల పరంగా గట్టి పోటీ ఇవ్వడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. విచిత్రంగా ఈ పోటీ ఫస్ట్ లుక్ ల నుంచే మొదలైపోయింది. ఎఫ్2 పోస్టర్ ఈ రోజు విడుదల కాగా వినయ విధేయ రామ(రిజిస్టర్డ్ టైటిల్)రేపు మధ్యాన్నం బయటికి వచ్చేస్తుంది. సినిమాల రిలీజ్ డేట్లు ఇంకా ప్రకటించకపోయినప్పటికి రెండింటి మధ్య మహా అయితే రెండు రోజుల కన్నా ఎక్కువ గ్యాప్ వచ్చే అవకాశం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9 లాక్ చేసుకుంది కాబట్టి 10 నుంచి 14 లోపే రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ సినిమాలు వచ్చేయాలి. ఎలా చూసుకున్నా గంటల వ్యత్యాసమే ఉంటుంది.

సంక్రాంతి సీజన్ అంటేనే ఈజీగా రెండు మూడు పెద్ద సినిమాలకు స్పేస్ ఇచ్చే వసూళ్లు రాబడుతుంది కాబట్టి మెగా బ్రదర్స్ పోటీ ఇబ్బంది కాదనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. రామ్ చరణ్ సినిమా ఫక్తు బోయపాటి మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్ కాగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఎఫ్2 అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ మూవీగా ఇన్ సైడ్ టాక్. సో జానర్లు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేనివి కాబట్టి పోటీ విషయంలో ఆందోళన అవసరం లేదేమో
Tags:    

Similar News