మెగా హీరో దేన్నీ లెక్క చేయట్లేదుగా

Update: 2016-09-30 15:30 GMT
నాగబాబు తనయుడు.. మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు కొంచెం స్లో అయిన సంగతి ఒప్పుకోవాల్సిందే. అరంగేట్రం చేసిన ఏడాది ఒకటి.. గతేడాది రెండు సినిమాలు రిలీజ్ చేయడంతో.. మెగా హీరోల్లో మంచి స్పీడ్ చూపించేంది ఈ కుర్రాడే అనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే.. ఈ ఏడాది 9 నెలలు గడిచిపోయినా ఇప్పటికీ ఒక్క సినిమా రాలేదు.. మిగిలిన మూడు నెలల్లో వస్తుందో లేదో తెలీదు. అయితే.. వచ్చే ఏడాదికి మాత్రం రెండు మూవీస్ రెడీ చేసేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ రెండు మూవీస్ 2017 ప్రారంభంలోనే విడుదల కానుండడం విశేషం.

శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్.. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా చిత్రాలను చేస్తుండగా.. మిస్టర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేసుకుంటోంది. మొదట స్పెయిన్ లో షూట్ పూర్తి చేసుకుని.. రీసంట్ గా ఊటీలో షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న మూవీని .. ఆ తర్వాత హైద్రాబాద్ లో ఫినిష్ చేయనున్నారు. అయితే., తాజాగా షూటింగ్ లో ఈ కుర్రాడికి పెద్ద గాయమే అయిందట. 3-4 వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినా.. ససేమిరా అంటున్నాడట ఈ హీరో.

ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్స్ ప్రకారం షూట్ పూర్తి చేస్తేనే.. అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయగలమని.. షెడ్యూల్స్ డిస్టర్బ్  చేయడం సరికాదని చెప్పి.. అందుకే తన కోసం షూటింగ్ ఆపద్దని అనడమే కాదు.. షూట్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నాడట వరుణ్ తేజ్. మెగా కుర్రాడు పట్టాలెక్కినట్లే ఉన్నాడు కదూ.
Tags:    

Similar News