పవన్ కెరియర్లో 'తమ్ముడు' ఎలాగో .. వరుణ్ కి 'గని' అలాగ!

Update: 2022-04-03 03:49 GMT
తెలుగులో బాక్సింగ్ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఒక ఆశయం చుట్టూ అల్లుకున్నప్పుడే ఈ తరహా కథలకు ప్రేక్షకులకు నీరాజనాలు పట్టారు. ఈ కథ కూడా అలాంటి బలమైన ఎమోషన్స్ తో ముడిపడి సాగుతుందని  ముందుగానే అల్లు అరవింద్ చెప్పారు. ఈ సినిమాలో యూత్ మనసులను అలరించే విషయాలతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. అందువలన ఈ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

వైజాగ్ లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ .. "ఈ ఈవెంట్ కి విచ్చేసిన అందరికీ నమస్కారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ గా భావించి ఈ ఈవెంట్ కి వచ్చారు. అందుకు నాకు చాలా సంతోషంగా  ఉంది.

'గని' గురించి చెప్పాలంటే మూడేళ్ల కష్టం గురించి చెప్పాలి. వరుణ్ తేజ్ గారు నన్ను నమ్మి ఇంతపెద్ద ప్రాజెక్ట్  ఇచ్చారు. పవన్ కల్యాణ్ గారికి 'తమ్ముడు' మూవీ ఒక మైల్ స్టోన్ గా ఎలా నిలిచిందో, 'గని' మూవీ కూడా వరుణ్ తేజ్ గారికి ఒక మైల్ స్టోన్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను.

నేను కొత్త డైరెక్టర్ ను అయినప్పటికీ  ఇంత పెద్ద ప్రాజెక్టును నా చేతిలో పెట్టినందుకు .. నాతో పాటు ఉంటూ నన్ను సపోర్ట్  చేసినందుకు అల్లు బాబీ గారికి .. సిద్ధు గారికి థాంక్స్ చెబుతున్నాను. మా గురువుగారు అల్లు అరవింద్ గారు ఎప్పటికప్పుడు మాకు ఏం కావాలో తెలుసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించారు. వారికి నేను కృతజ్ఞతలు  చెప్పుకుంటున్నాను.  ఇక ఈ సినిమా కోసం  పనిచేసిన ఆర్టిస్టులంతా కూడా ఎంతో సహకరించారు. అలాగే మా  టెక్నీషియన్స్ అంతా కూడా ఎంతో సిన్సియర్ గా పనిచేశారు. మరింత బెటర్ అవుట్ పుట్ ఇవ్వడానికి కష్టపడ్డారు.

సినిమా తీస్తే రికార్డ్స్ లో ఉంటాము .. హిట్ అయితే చరిత్రలో ఉంటాము. 'గని' సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఏప్రిల్ 8వ తేదీన థియేటర్లకు వస్తుంది. మీరంతా తప్పకుండా థియేటర్లలో చూస్తూ ఎంజాయ్ చేయండి" అంటూ చెప్పుకొచ్చాడు.  
Tags:    

Similar News