వరుణ్ ను దగ్గరగా చూశాను .. అది మామూలు కటౌట్ కాదు!

Update: 2022-04-06 15:32 GMT
ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలు కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ ముందుకు వెళుతున్నారు. సినిమా నిర్మాణ రంగంలోకి యువ నిర్మాతలు అడుగుపెట్టడం వలన, వాళ్లు కూడా కొత్తదనానికి స్వాగతం పలుకుతూ న్యూ టాలెంట్ ను  ప్రోత్సహిస్తున్నారు. అలా హీరో వరుణ్ తేజ్ తన 'తొలిప్రేమ' సినిమాకి డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేసిన కిరణ్ కొర్రపాటికి ఛాన్స్ ఇచ్చాడు. కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్న అల్లు బాబీ, తన స్నేహితుడితో కలిసి నిర్మాతగా .. తన  తొలి సినిమాగా 'గని' సినిమా నిర్మించాడు.

'రిలీజ్ పంచ్'  పేరుతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన నవీన్ చంద్ర మాట్లాడుతూ .. " అందరికీ నమస్కారం  .. మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 'గని'ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా  చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. షూటింగు జరుగుతున్నప్పుడు వరుణ్ తేజ్ ను నేను చాలా దగ్గరగా చూశాను. ఫ్యాన్స్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడనేది నాకు తెలుసు.

ఎక్కడ ఎలాంటి తేడా రాకుండా .. ఎక్కడా తగ్గకుండా ఆయన ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అభిమానులు ఎన్నో అంచనాలతో వస్తారు .. వాళ్లని నిరాశపరచకూడదని చెప్పేవారు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ చేయడం అంత ఆషా  మాషీ విషయమేం కాదు. ఈ సినిమా కోసం ఇష్టంగా కష్టపడ్డాం. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన అల్లు బాబీ ..  సిద్ధు ..  కిరణ్ కొర్రపాటికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక అల్లు అరవింద్ గారిని నేను బిగ్ డాడీ అని పిలుస్తుంటాను.

ఆయన ఈ సినిమాను చూసి .. సినిమా చాలా బాగుందయ్యా .. చాలా బాగా చేశావ్ అన్నారు. అప్పుడు నాకు చాలా సంతోషంగా .. చాలా తృప్తి గా అనిపించింది. ఆయన అభినందన  మా ఆకలి తీర్చింది. అలాంటి అభినందనల కోసం మేమంతా కష్టపడతాం. వరుణ్ కటౌట్ ఎలా ఉందో చూశారు గదా. నేను బాక్సింగ్ రింగ్ లో నుంచున్నాను. వరుణ్ దగ్గరికి రాగానే ఆ  కటౌట్ చూసి షాక్ అయ్యాను. నేను ఏం చేయాలి? ఎలా చేయాలి? అనుకున్నాను. వరుణ్ నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఏప్రిల్ 8న 'గని' చాలా స్ట్రాంగ్  పంచ్ తో వస్తుంది .. చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.  
Tags:    

Similar News