లోఫర్ డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీనా??

Update: 2016-04-29 04:48 GMT
లోఫర్ మూవీ నష్టాల గొడవ పూరీ జగన్నాథ్ కి - డిస్ట్రిబ్యూటర్లకు మధ్య బోలెడు అంతరం తీసుకొచ్చింది. ఈ వివాదంలో చివరకు పూరీనే తగ్గమంటూ పెద్ద హీరోల నుంచి ఒత్తిడులు కూడా వచ్చాయన్నారు. ఇప్పటికైతే ఇంకా ఈ వివాదం విషయంలో ఎవరూ వెనకడుగు వేయలేదు కానీ.. వరుణ్ తేజ్ తీసుకున్న ఓ స్టెప్ మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు శుభవార్తే అని చెప్పాలి.

ఇప్పుడు తన కొత్త సినిమా మిస్టర్ ను స్టార్ట్ చేశాడు వరుణ్ తేజ్. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని.. టాగూర్ మధు - నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. లోఫర్ చిత్రంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకే.. ఈ 'మిస్టర్' ను అందిస్తానని, అది కూడా నష్టాలను భర్తీ చేసే రేట్లకే ఇస్తానని చెప్పాడట వరుణ్ తేజ్. లోఫర్ - మిస్టర్ లకు నిర్మాతలు వేరే అయినా.. తనే చొరవ తీసుకుని ఒప్పించాడని తెలుస్తోంది. దీంతో లోఫర్ డిస్ట్రిబ్యూటర్లకు వివాదాన్ని పక్కన పెట్టే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.

నష్టపోయిన వారికి ఇలా తన నెక్ట్స్ మూవీని ఇచ్చే ఆఫర్ ను.. రీసెంట్ గానే పవన్ అప్లై చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ను కొనుగోలు చేసి లాస్ అయినవారికి.. తన తరువాతి ప్రాజెక్టును తక్కువ ధరలకే ఇస్తానని చెప్పాడు పవన్. అలా పవర్ స్టార్ వేసిన బాటనే.. పవన్ అన్నగారి అబ్బాయ్ వరుణ్ తేజ్ కూడా ఫాలో అయిపోతున్నాడన్న మాట.
Tags:    

Similar News