అక్టోబర్ 22న రిలీజ్ అవుతోంది కంచె. ఇప్పటివరకూ ఈ మూవీకి సంబంధించిన పలు ట్రైలర్లు విడుదలయ్యాయి. అన్నింటిలోనూ విజువల్స్ ప్రధాన ఆకర్షణ. రెండో ప్రపంచయుద్ధం, 70 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను రియలిస్టిక్ చూపించడంలో.. క్రియేటర్ గా పేరుపొందిన క్రిష్ సక్సెస్ అయ్యాడు.
అయితే ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ట్రైలర్లు - టీజర్లు ఒకెత్తు.. రిలీజ్ మరో రెండ్రోజులు ఉందనగా రిలీజ్ చేసిన ట్రైలర్ మరొక ఎత్తు. నిజానికి ఈ ట్రైలర్ ఇచ్చిన ఆడియో బ్యాక్ డ్రాప్ గతంలో ఇచ్చినదే అయినా.. చాలా విజువల్స్ ని ఛేంజ్ చేశారు. మ్యూజిక్ కూడా ఊపిరి బిగబట్టుకునేలా ఉంది. మొత్తం ట్రైలర్ లో ఏ ఒక్క సెకన్ మిస్ అయినా.. ఏదో ఒక బ్రహ్మాండమైన విజువల్ మిస్ అయినట్లే. ఆకాశం నుంచి బాంబుల వర్షాన్ని తొలిసారిగా కురిపించింది రెండో ప్రపంచయుద్ధంలోనే. ఆ సన్నివేశాలను కూడా కళ్లకు కట్టినట్లుగా చూపించేశాడు క్రిష్. 12 నిమిషాలే యుద్ధ సన్నివేశాలు ఉంటాయని చెబ్తున్నా.. అందుకు ప్రిపరేషన్స్ - పరిస్థితులను బాగానే తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. వీటికి తోడు విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ - పగలు కూడా మిళితం చేసి.. సూపర్బ్ స్టోరీతో సిద్ధమైన కంచె రిలీజ్ కు.. మరొక్క రోజు మాత్రమే టైం ఉంది.
చూద్దాం.. కంచెతో అంటు క్రిష్ ఇటు వరుణ్ తేజ్ లు కూడా తొలి కమర్షియల్ హిట్ అందుకోవాలి మరి.