మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ `ఎఫ్-3` తో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముదు రిలీజ్ అయిన `గని` అంచనాలు అందుకోనప్పటికీ ఆ ప్రభావం వరుణ్ ఇమేజ్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆవెంటనే ఎఫ్-3 సక్సెస్ తో ఫెయిల్యూర్ పక్కకి తొలగిపోయింది. తాజాగా కొత్త చిత్రాన్ని రెట్టించని ఉత్సాహంతో ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే వరుణ్ తేజ్ లండన్ చేరుకున్నాడు. వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూట్ లో జాయిన్ అవ్వడానికి రెడీ గా ఉన్నాడు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన `ది ఘోస్ట్` పనుల్లో ఉన్నారు. రేపు రిలీజ్ అనంతరం ఫ్రీ అయిపోతారు. ఈ నేపథ్యంలో 10వ తేదీన ప్రవీణ్ అండ్ కో లండన్ ప్లైట్ ఎక్కనుంది.
నాటి నుంచి ఏకధాటిగా లండన్ లో నెల రోజుల పాటు షూటింగ్ చేస్తారు. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకి అత్యంత కీలకమైనవని తెలుస్తోంది. లండన్ షూట్ తోనే సగం షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అటుపై బ్యాలెన్స్ షూట్ హైదరాబాద్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మరి లండన్ షెడ్యూల్ వెనుక కహానీ ఏంటంటే? చాలా కథే ఉందని తెలుస్తోంది. లండన్ లో షూట్ చేస్తే ఖర్చు కలిసొస్తుందిట. ఆయన నిర్మాతగా పనిచేసిన పలు సినిమాలు లండన్ లో కనీసం ఒక్క షెడ్యూల్ అయినా ప్లాన్ చేస్తుంటారు. లండన్ అందాల్లో షూటింగ్ కి అనుకూలత..ఇతర కారణాలు అక్కడ షూటింగ్ నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.
అలాగే బీవీఎస్ ఎన్ పారితోషికాలు పౌండ్స్ లో ఇస్తారు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `నాన్నకు ప్రేమతో` షూటింగ్ దాదాపు లండన్ లోనే జరిగింది. ఆయనకు పారితోషికం పౌండ్స్ లోనే ఇచ్చారు. అలాగే వరుణ్ తో గతంలో `తొలిప్రేమ` చిత్రాన్ని కూడా బీవీఎస్ నే నిర్మించారు. ఆ సినిమా షూటింగ్ కూడా లండన్ లోనే జరిగింది.
ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబట్టాయి. ఆ సెంటిమెంట్ గాను సదరు నిర్మాత లండన్ చిత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పొచ్చు. ఇండస్ర్టీలో సాధారణంగానే సెంటిమెంట్ లు ఎక్కువ. అందులోనూ డబ్బులొస్తున్నాయంటే? ఆ సెంటిమెంట్ ని ఇంకా బలంగా నమ్ముతారు. మరి ఈ సినిమాలో మెగా ప్రిన్స్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.