మెగా కుర్రాడు వరుణ్ తేజ్ ను చూస్తే మామూలుగానే హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అతడికి కొంచెం టచప్స్ ఇస్తే చాలు.. లుక్ అదిరిపోతుంది. శ్రీను వైట్ల సినిమా కోసం అలాంటి లుక్ తోనే రెడీ అయిపోయాడు మెగా కుర్రాడు. పైన ఫొటోలో చూస్తున్నారుగా మెగా కుర్రాడు ఎలా తయారయ్యాడో? ఓ హాలీవుడ్ హీరోనే ఇక్కడికి దిగుమతి అయిపోయినట్లుగా లేడూ ఈ కొత్త లుక్ లో.
కొన్ని రోజులుగా గడ్డం అది పెంచితే బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగా ఖాళీ టైంలో ఏం చేయాలో తోచక అలా వదిలేశాడేమో అనుకున్నారంతా. కానీ ఆ గడ్డానికి కొంచెం స్టైలింగ్ అదీ చేసి.. పోష్ గా ఉండే బట్టలవీ తొడిగితే ఇలా షాకింగ్ లుక్ లోకి వచ్చేశాడు మెగా కుర్రాడు. మామూలుగా రొటీన్ సినిమాలు తీసే శ్రీను వైట్ల.. వరుణ్ ను ఇలా రెడీ చేయించాడంటే కొంచెం ఏదో భిన్నంగా ట్రై చేయబోతున్నాడని అర్థమైపోతుంది.
తొలి సినిమా ‘ముకుంద’లో పక్కింటి కుర్రాడిలా మామూలుగా కనిపించిన వరుణ్.. ఆ తర్వాత ‘కంచె’లో పాత తరం కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. ‘లోఫర్’లో మాస్ అవతారంలోనూ మెప్పించాడు. ఇప్పుడు వైట్ల సినిమాకు మరో సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. మొత్తానికి మెగా కుర్రాడు మిగతా హీరోలకు తాను చాలా భిన్నంగా అని చాటుకుంటున్నాడు.