మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మూవీ వచ్చి చాలా కాలమే అయింది. 2015 డిసెంబర్ చివరలో వచ్చిన లోఫర్ మూవీ తర్వాత.. వరుణ్ తేజ్ కొత్త సినిమా విడుదల కాలేదు. ముందుగా అనుకున్నవి సెట్ కాకపోవడం.. మొదలుపెట్టిన తర్వాత ఆలస్యం కావడం వంటివి ఇందుకు కారణాలు.
ఎట్టకేలకు శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ మూవీని కంప్లీట్ చేశాడు వరుణ్ తేజ్. లావణ్య త్రిపాఠి.. హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించిన మిస్టర్.. ఇప్పుడు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైపోయింది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కూడా పూర్తి చేసేశారు. రొమాంటిక్ ఎంటర్టెయినర్ జోనర్ లో తెరకెక్కిన మిస్టర్ కు.. యూ/ఏ సర్టిఫికేట్ అందించింది సెన్సార్ బోర్డ్. మూవీ విడుదలకు ఆఖరి అడ్డంకి కూడా తొలగిపోవడంతో.. ఏప్రిల్ 14న మిస్టర్ రిలీజ్ ఖాయమైపోయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ ను భారీగానే రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు యూఎస్ లో కూడా 100 స్క్రీన్లలో మిస్టర్ ను విడుదల చేస్తుండడం విశేషం. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇదే అతి పెద్ద రిలీజ్ కాగా.. ఈ చిత్రం సక్సెస్ కావడం.. అటు దర్శకుడు శ్రీను వైట్లకు.. ఇటు హీరో వరుణ్ తేజ్ కు చాలా ముఖ్యం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/