స్పెయిన్ లో మిస్టర్.. మొదలెట్టేశారు

Update: 2016-07-19 05:16 GMT
శ్రీను వైట్ల- వరుణ్ తేజ్ కాంబినేషన్ లో మిస్టర్ మూవీ.. ఇలా ఓ స్టేట్మెంట్ వచ్చి చాలా నెలలే అయింది. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ సినిమాకి.. ఆ నెలాఖర్లో ముహూర్తం షాట్ తీశారు. మే నెల నుంచి స్పెయిన్ లో షూటింగ్ చేస్తున్నాం అంటూ ప్రెస్ నోట్ ఇచ్చినా.. ఎక్కడా అడుగు కూడా పడలేదు. ఇలా నాలుగైదు సార్లు వాయిదాలు పడ్డంతో.. అసలు ప్రాజెక్ట్ పైనే అనుమానాలు తలెత్తాయి. మధ్యలో శేఖర్ కమ్ముల ఎంట్రీ ఇచ్చి.. వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడని అనగానే.. ఇక మిస్టర్ పై డౌట్స్ పెరిగిపోయాయి.

ఈ అనుమానాలన్నిటికీ చెక్ పెట్టేస్తూ.. మిస్టర్ షూటింగ్ ని మొదలు పెట్టేసింది యూనిట్. టెక్నికల్ టీమ్ తో పాటు అసిస్టెంట్స్ కూడా యూరోప్ వీసా సమస్యలను పరిష్కరించుకుని.. కొన్ని రోజుల క్రితం టీమ్ అంతా స్పెయిన్ చేరుకుంది. స్టార్టింగ్ నుంచి పక్కా ప్లాన్ ఉండడంతో.. షూటింగ్ శరవేగంగా జరిగిపోతోందని సమాచారం. మూడు నెలల లేట్ ని కవర్ చేసేసేంత రేంజ్ లో కాకపోయినా.. మాంచి స్పీడ్ తోనే పిక్చరైజ్ చేస్తున్నారట.

బ్రూస్ లీ ఎఫెక్ట్ నుంచి బయటపడ్డం కోసం శ్రీను వైట్ల ఈ సినిమాతో తన సత్తా చాటేందుకు ట్రై చేస్తున్నాడు. మరోవైపు ఆరు నెలల తర్వాత కొత్త  సినిమా స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడని అంటున్నారు. మిస్టర్ కోసం స్పెయిన్ లో మెజారిటీ భాగం షూటింగ్ చేయనున్నారు.
Tags:    

Similar News