స్టార్ డైరెక్టర్ కు రాజమౌళి సెంటిమెంటు గురించి ప్రత్యేకించి చెప్పాలా?.. జక్కన్నకు జూలై సెంటిమెంట్. ఈ నెల తన దృష్టిలో చాలా ప్రత్యకమైనది. కెరీర్ పరంగా దశ దిశ మార్చేసిన లక్కీ మంథ్ గా భావిస్తారు. ఆయన డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు అదే నెలలో రిలీజ్ అయ్యి సక్సెస్ అయినవే. రాజమౌళి కెరీర్ లో ఆరంభంలో రెండవ సినిమాగా తెరకెక్కించిన సింహాద్రి జూలైలోనే రిలీజ్ అయి సంచలన విజయం నమోదు చేసింది. అటుపై అప్పటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని తిరగరాసిన మగధీర కూడా జూలైలోనే విడుదలై సంచలన విజయం నమోదు చేసింది. రాజమౌళి క్రియేవిటీకి అద్దం పట్టిన ఈగ కూడా జులైలోనే రిలీజ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసింది.
ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన `బాహుబలి: ది బిగినింగ్` కూడా అదే నెలలో రిలీజ్ అయి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసింది. అందుకే రాజమౌళికి జూలై నెల అంటే ఎంతో ప్రత్యేకమైనది. అప్పటి నుంచి ఆయన డైరెక్ట్ చేసే ఏ సినిమా అయినా ఆ నెలలో రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. తప్పని పరిస్థితుల్లో తప్ప ఆ మంథ్ ని స్కిప్ చేయడానికి ఇష్టపడరు. ఒక్క ఆర్.ఆర్.ఆర్ మినహా భారీ చిత్రాల్ని జూలైలోనే రిలీజ్ చేశారు రాజమౌళి. షూటింగ్ డిలే వల్ల ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇక జక్కన్న లక్కీ మంత్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్ క్యాష్ చేసుకోబుతున్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాక్సర్..ఫైటర్ అనే టైటిల్స్ ఇప్పటికే వినిపించాయి. ఈ మూవీ కోసం వరుణ్ కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికే బాక్సింగ్ కి సంబంధించిన శిక్షణ పూర్తిచేసి రెడీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా సెట్స్ కు తీసుకెళ్లి చిత్రీకరణ శరవేగంగా పూర్తిచేసి జూలైలో నెలలో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోందిట. షూటింగ్ ప్రణాళిక సరిగ్గా వేసుకుంటే మూడు నెలల్లో సినిమా షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చుట్టేయొచ్చు. కాబట్టి వరుణ్ జక్కన్న లక్కీ మంథ్ ని లాక్ చేసి లాభపడే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తోంది. మరి వరుణ్ టీమ్ మైండ్ లో ఏం ఉందో.. వాస్తవంగా ఏం జరుగుతుందో వేచి చూడాలి.