శ్రీకాంత్ అడ్డాల.. క్రిష్.. పూరి జగన్నాథ్.. శ్రీను వైట్ల.. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఇప్పటిదాకా పని చేసిన దర్శకులు వీళ్లు. అందరూ పెద్ద దర్శకులే. తెలుగులో ఓ అరంగేట్ర హీరోకు ఇలాంటి అవకాశాలు దొరకడం అరుదు. ‘లోఫర్’ లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత ‘మిస్టర్’ సినిమాను లైన్లో పెట్టిన వరుణ్.. ఆ సినిమా షూటింగ్ మధ్యలో గాయపడ్డ సంగతి తెలిసిందే. కాలు విరిగి రెండు నెలలకు పైగా ఇంటి పట్టునే ఉండిపోయినప్పుడు కూడా మెగా కుర్రాడికి బోలెడన్ని ఆఫర్లు వచ్చాయట. ఆ ఖాళీ సమయంలో చాలా కథలు విన్నాడట.
‘‘నా అదృష్టం కొద్దీ పెద్ద పెద్ద దర్శకులతో పని చేసే అవకాశం దక్కుతోంది. ‘మిస్టర్’.. ‘ఫిదా’ సినిమాలు ఓకే అయ్యాక కూడా నాకు చాలామంది కథలు చెప్పారు. ‘మిస్టర్’ షూటింగ్ లో గాయపడి ఇంటి పట్టునే ఉన్న సమయంలో 20కి పైగా కథలు విన్నాను. ఐతే అన్నింట్లోకి కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథ నచ్చింది. అతడితోనే నా తర్వాతి సినిమా ఉంటుంది. ఇప్పటిదాకా అనుభవజ్నులైన దర్శకులతో పని చేశా. తొలిసారి కొత్త డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నా’’ అని వరుణ్ అన్నాడు.
గీతా ఆర్ట్స్ బేనర్లో అనుకుని ఆగిపోయిన సినిమా గురించి చెబుతూ.. ‘‘అవును.. అనుకున్నాం. కానీ సరైన కథ దొరకలేదు. ఈ మధ్య బన్నీ పుట్టిన రోజు వేడుకలకు నాన్న వెళ్లినపుడు కూడా అరవింద్ గారు నాతో సినిమా చేయాలని అన్నారట. కథ దొరికతే తప్పకుండా చేస్తాం. చరణ్.. తేజు.. బన్నీలతో మల్టీస్టారర్లు చేయాలని ఉంది’’ అని వరుణ్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/