గత కొంత కాలంగా విజయాలు లేక సతమతమవుతోన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మంచి హిట్ కొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కడం లేదు. అయితే ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా సెట్ అయిన వినాయక్ తో సాయి వర్క్ చేస్తుండడంతో ఈ సారి హిట్టు పక్కా అని చెబుతున్నాడు. రీసెంట్ గా ఇంటిలిజెంట్ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను తెలియజేసింది.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తయాయ్యిందో కూడా అర్ధం కావడం లేదు. ఎందుకంటే వర్క్ అంత కూల్ గా జరిగింది. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా వినాయక్ సర్ నన్ను చాలా కొత్తగా చూపించారు. స్క్రీన్ పై నన్ను నేను చూసుకున్న తరువాత నమ్మలేకపోయా. సాధారణంగా మెగాస్టార్ లాంటి హీరోతో వర్క్ చేశాకా ఆ దర్శకుడు ఆ లెవెల్ హీరోతో వర్క్ చేస్తాడేమో అని అందరు అనుకుంటారు.
కానీ వినాయక్ గారు నన్ను తీసుకున్నారు. అందుకు నేను అదృష్టవంతున్ని. ఇక థమన్ మరో సారి నాకు మంచి ఆల్బమ్ ఇచ్చాడు. అలాగే హీరోయిన్ లావణ్య పర్ఫెమెన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఫైనల్ గా ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్ కాబోతోంది అలాగే వరుణ్ తేజ్ తొలిప్రేమ కూడా అదే రోజు వస్తోందని రెండు సినిమాలు మంచి హిట్ అవుతాయని తెలిపాడు. అయితే చివరగా వరుణ్ తేజ్ సినిమాకు ఎంతవరకు పోటీ అన్న ప్రశ్నకు సాయి తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. మా ఫ్యామిలీతో నేను పోటీ పడాలని ఎప్పుడు అనుకోను అలాంటిదేమి లేదని కూల్ గా వివరించాడు.