ఫలానా సన్నివేశంలో ఇరగదీశా.. లెంగ్తీ సీన్ ఒక్క టేకులో లేపేశా.. అని గొప్పలు చెప్పుకుంటుంటారు హీరోలు. ఐతే మెగా కుర్రాడు వరుణ్ తేజ్ మాత్రం తాను బాగా చేయలేకపోయిన సీన్ గురించి చెబుతున్నాడు. లోఫర్ షూటింగ్ సందర్భంగా తాను సరిగా నటించలేక డైరెక్టఱ్ ను ఇబ్బంది పెట్టిన సన్నివేశం గురించి మీడియాతో పంచుకున్నాడు.
‘‘లోఫర్ మూవీలో సుద్దాల అశోక్ తేజ గారు సువ్వి సువ్వి సువ్వాలమ్మ పల్లవితో ఓ ఎమోషనల్ సాంగ్ రాశారు. ఆ పాట అంతా ఏడుస్తూ నటించాలి. కానీ ఆ రోజు ఆలా నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ రోజు ఉదయం క్లైమాక్స్ ఫైట్ షూట్ చేశారు. అది చేశాక ఎమోషనల్ సాంగ్లో నటించడానికి ఇబ్డందైంది. నా ఇబ్బంది చూసి పూరి గారు ఆ రోజుకు షూటింగ్ క్యాన్సిల్ చేశారు. మరుసటి రోజు ఫ్రెష్ మైండుతో రమ్మన్నారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు పాట షూటింగ్ చేశాం. చాలా బాగా వచ్చింది. పూరి గారు కూడా మెచ్చుకున్నారు’’ అని చెప్పాడు వరుణ్.
కంచె సినిమా పూర్తి చేసిన ఒక్క రోజులోనే లోఫర్ చేశానని.. ఇంతకుముందు చేసిన రెండు సినిమాలతో పోలిస్తే ఇది భిన్నమైన పాత్ర అయినప్పటికీ పూరి చెప్పినట్లు చేసుకెళ్లిపోయానని వరుణ్ చెప్పాడు. లోఫర్ మూవీలో బాగా చేశానని సినిమా చూసిన వాళ్లు అంటున్నారని.. ఐతే తనతో బాగా చేయించిన ఘనత పూరిదే అని వరుణ్ చెప్పాడు.