నా తమ్ముడి ని అంటే ఇలాగే రియక్ట్‌ అవుతా..!

Update: 2018-12-21 05:45 GMT
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారంను రేపిన విషయం తెల్సిందే. బాలకృష్ణ ఎవరో తెలియదు అనడంతో పాటు ఆ తర్వాత మరో వీడియో లో బాలకృష్ణ తెలుసు ఒక పెద్ద కమెడియన్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి, తాను అంటున్నది అప్పటి నటుడు, కమెడియన్‌ బాలకృష్ణ గురించి అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ను మరింతగా ఉండికించాడు. దాంతో నందమూరి ఫ్యాన్స్‌ మెగా ఫ్యామిలీ పై, నాగబాబు పై ఒక రేంజ్‌ లో లేచారు. నాగబాబు తనయుడు అంతరిక్షం మూవీ పై కక్ష సాధిస్తాం అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా హెచ్చరించారు.

ఇలాంటి సమయంలో నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ ఒక ఇంటర్వ్యూ లో తన తండ్రి వ్యాఖ్యల పై స్పందించాడు. అలా ఎందుకు మాట్లాడారు అంటూ నేను నాన్నను అడిగాను. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు అవసరమా అంటూ అడిగేందుకు ప్రయత్నించాను. అప్పుడు ఆయన నాతో... ‘‘మా తమ్ముడిని ఏమైనా అంటే ఇలాగే రియాక్ట్‌ అవుతాను, నీకు నచ్చినా నచ్చక పోయినా నువ్వు కూర్చో’’ అన్నాడు అంటూ వరుణ్‌ చెప్పుకొచ్చాడు.

బాబాయి పవన్‌ కు వరుణ్‌ తేజ్‌ కూడా గతంలో ఫుల్‌ సపోర్ట్‌ ఉంటుందని ప్రకటించిన విషయం తెల్సిందే. జనసేన కోసం పని చేసేందుకు కూడా తాను సిద్దమే అంటూ గతంలో వరుణ్‌ పేర్కొన్నాడు. 2019 ఎన్నికల్లో తన అవసరం ఉంటే ఖచ్చితంగా జనసేన కోసం ప్రచారం చేసేందుకు ముందు ఉంటాను అంటూ ఆమద్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తండ్రి కొడుకులు కూడా పవన్‌ కు చాలా మద్దతుగా నిలుస్తున్నారు.
Tags:    

Similar News