వారం రోజుల నుంచి టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది పవన్ కళ్యాణ్ అభిమానుల వ్యవహారం. మెగా హీరోల ప్రతి ఫంక్షన్లోనూ పవర్ స్టార్ కోసం అభిమానులు నినాదాలు చేయడం.. అతిథుల్ని మాట్లాడనీయకుండా చేయడం.. కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఈ వ్యవహారంపై పవన్ అన్నయ్య నాగబాబు సీరియస్ అయినా అభిమానుల్లో మార్పు లేదు. పైగా వరుణ్ తేజ్ కు సంబంధించిన ఫంక్షన్లలో పవన్ ఫ్యాన్స్ తీరు శ్రుతి మించుతోంది. కానీ ఆ ఫ్యామిలీ హీరోలకు అడ్డం పడ్డా పర్లేదనుకున్నారు కానీ.. ప్రభాస్ లాంటి వేరే హీరోను కూడా ఇబ్బంది పెట్టడంతో పవన్ అభిమానుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో పవన్ జోక్యం చేసుకోవాలని పూరి జగన్నాథే స్వయంగా చెప్పే పరిస్థితి వచ్చింది.
ఐతే నాగబాబు తనయుడు, పవన్ ఫ్యాన్స్ నుంచి అందరికంటే ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటున్న వరుణ్ తేజ్ మాత్రం అభిమానుల గొడవను లైట్ తీసుకోవాలి అంటున్నాడు. ప్రభాస్ సైతం ఆడియో ఫంక్షన్ సంఘటనల్ని పెద్దగా పట్టించుకోలేది చెబుతున్నాడు. ‘‘మొన్న ఆడియో ఫంక్షన్లో అభిమానులు కాస్త హంగామా చేశారు. అదంతా సహజమే. ఎందుకంటే వాళ్లకు బాబాయ్ అంటే చాలా ఇష్టం. బాబాయ్ ఎక్కువగా బయటికి రారు. అభిమానులకు ఆయన్ని చూడాలన్న కోరిక ఎక్కువైపోతుంటుంది. అందుకే అలా చేస్తారు. నిజానికి లోఫర్ ఫంక్షన్లో జరిగిందానికి ప్రభాస్ ఏమీ అనుకోలేదు. అతను చాలా కూల్ పర్సన్’’ అని చెప్పాడు వరుణ్. పవన్ కళ్యాణ్ తన కెరీర్ విషయంలో సలహాలేమీ ఇవ్వరని.. ఎవరి ప్రయాణం వాళ్లే చేయాలని మాత్రమే చెబుతారని.. బాబాయితో తనకు మంచి రిలేషన్ షిప్ ఉందని వరుణ్ తెలిపాడు.