చరణ్‌ అంటే చాలా భయం ఉండేది

Update: 2017-04-13 14:13 GMT
తనకు రామ్ చరణ్‌ తో ఎలాంటి బాండింగ్ ఉండేదో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాడు యంగ్ హీరో వరుణ్‌ తేజ్. రేపు తన ''మిష్టర్'' సినిమా రిలీజవుతుండగా.. ఇప్పుడు ఫేస్ బుక్ లో అభిమానులతో లైవ్ చాటింగ్ చేసిన వరుణ్‌.. చరణ్‌ అంటే తనకు భయం ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడూ చరణ్‌ చాలా ప్రాంక్స్ చేయడం వలనే మనోడు అంత భయపడేవాడట.

''ఒకసారి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. అప్పుడు పెదనాన్న ఇంట్లో లేరు. నేను ఇంట్లో రూమ్స్ లోకి వెళితే.. లోపల లైట్లన్నీ ఆపేసి నన్ను భయపెట్టడానికి చాలా ప్రయత్నించాడు చరణ్‌ అన్న. ఎప్పుడూ ఏదో ఒక ప్రాంక్ చేసి భయపెట్టేవాడు. కాని చిన్నప్పుడు చరణ్‌ అంటే అంత భయం ఉండేది కాని.. ఇప్పుడు మాత్రం చాలా గౌరవం ఉంది. తను హీరో అయ్యాక మాకు ఇనిస్పిరేషన్ గా నిలుస్తున్నాడు'' అంటూ సెలవిచ్చాడు వరుణ్‌ తేజ్.

ఇకపోతే తన లేటెస్ట్ మూవి ''మిష్టర్'' ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది అంటున్నాడు వరుణ్‌. ఖచ్చితంగా సినిమాలో ఒక కొత్త వరుణ్‌ ను చూస్తారని.. అలాగే కొత్తగా డ్యాన్సులు కూడా కాస్త ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి మిష్టర్ విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నట్లే ఉన్నాడు ఈ యంగ్ మెగా హీరో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News