ఫిబ్రవరి లో విడుదల అయిన మన తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చేస్తున్న హడావిడి మాములుగా లేదు. వీటిల్లో అన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రస్తావించాల్సింది తొలి ప్రేమ గురించి. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ ని పెట్టుకున్నాడు, అసలు ఏ మాత్రమైన బాగా చేస్తాడా అని అందరూ సందేహాలు వ్యక్త పరుస్తున్న సమయంలో అంతకుమించి అన్నట్టు అన్నట్టు వచ్చేసాడు వరుణ్ తేజ్.
విడుదలైన మొదటి వారంలోనే 18 కోట్లు రాబట్టిన ఈ సినిమా చాలా సులభంగా 35 కోట్లు దాటేస్తుంది అని జాతకం చెప్పేస్తున్నారు ట్రేడ్ పండితులు. పోటీగా ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా, అన్నీ పాజిటివ్ టాక్ సంపాదించినా ఏది కూడా తొలి ప్రేమ ను మించట్లేదు. నాని నిర్మించిన మొదటి సినీమా అయిన 'అ!' పాపులర్ తారాగణం తో మన ముందుకు వచ్చింది. సినిమాకు చాలా మంచి టాక్ ఉంది. అందరూ అదరకొట్టేశారు అంటూ ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక పక్క పాపులర్ మార్వెల్ కామిక్స్ లో ఈమధ్యనే జాయిన్ అయిన కొత్త కారెక్టర్ గా బ్లాక్ పాంథర్ అనే అమెరికన్ సూపర్ హీరో సినిమా వచ్చి ఫాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. నాగ శౌర్య నటించిన చలో సినిమాకు కూడా బాగానే ఆదరణ లభిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య జరిగే గొడవల నుండి కామెడీ ని పుట్టించి మన అందర్నీ నవ్వించిన చలో సినిమా కూడా బాగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అయినా కూడా వీటిల్లో ఏ ఒక్క సినిమా కూడా కలెక్షన్ల విషయంలో తొలి ప్రేమకు గట్టి పోటీ ఇవ్వడం లేదు.
ఇన్ని మంచి టాక్ ఉన్న సినిమాలు థియేటర్ లలో ఉన్నప్పటికీ జనాలు ఇంకా తొలి ప్రేమ సినిమాను మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు అంటేనే తెలియట్లేదు వరుణ్ తేజ్ - రాశి ఖన్నా వారి అందమైన ప్రేమకథతో ప్రేక్షకులను ఎంత మాయ చేశారో. చూస్తుంటే ఇంక ముందు కూడా ఈ మెగా హీరో కి ఏది ఎదురు లేనట్టే ఉంది. రామ్ చరణ్ రంగస్థలం కూడా మార్చి ఆఖరు వరకు రాదు. ఈ మధ్యలో వచ్చే పెద్ద సినిమాలు కూడా ఏమి లేవు. కనుక ఈ సంవత్సరం లో తొలి ప్రేమ ను మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ గా మనం పరిగణించచ్చు.
ఇక భాగమతి కూడా పెద్ద హిట్టే అయ్యింది కాని.. ప్రస్తుతం తొలిప్రేమ కలక్షన్లు ఆ సినిమాకంటే చాలా ఎక్కువగా వచ్చేసే ఛాన్సుంది. అది సంగతి.