టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోలకు అమెరికాలో మిలియన్ డాలర్ కల చాలా ఆలస్యంగా నెరవేరింది. ఇంకా ఆ కల తీరకుండా ఉండిపోయిన స్టార్లు కూడా ఉన్నారు. అలాంటిది యువ కథానాయకుడు వరుణ్ వరుసగా రెండో సినిమాతో మిలియన్ డాలర్ క్లబ్బును అందుకున్నాడు. గత ఏడాది ‘ఫిదా’ సినిమా అతడికి తొలి మిలియన్ డాలర్ సినిమా అయింది. ఆ సినిమా ఆ మార్కునే కాదు.. ఏకంగా 2 మిలియన్ క్లబ్బును కూడా అందుకుంది. ఈ సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు వరుణ్ కొత్త సినిమా ‘తొలి ప్రేమ’ సైతం మిలియన్ డాలర్ల మార్కును దాటింది.
వరుసగా రెండు సినిమాలతో మిలియన్ మార్కును అందుకోవడం గొప్ప విషయమే కానీ.. ‘ఫిదా’ స్థాయిలోనే ‘తొలి ప్రేమ’ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఇది మిలియన్ మార్కుకే కష్టపడిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘ఫిదా’కు ఉన్న ఆల్మోస్ట్ అన్ని అడ్వాంటేజీలు ‘తొలి ప్రేమ’కు కూడా ఉన్నాయి. దాని లాగే ఇదీ లవ్ స్టోరీనే. అందులో మాదిరే ఇందులోనూ ఫన్ ఉంది. దానికి దీనికి ఫస్టాఫే ప్రధాన ఆకర్షణ. రెండో అర్ధం రెండిట్లోనూ బలహీనమే. ఐతే ‘ఫిదా’ అంచనాల్ని మించిపోయి వసూళ్ల వర్షం కురిపిస్తూ 2 మిలియన్ మార్కును అందుకుంటే.. ‘తొలి ప్రేమ’ మాత్రం కష్టం మీద రెండు వారాలకు గానీ మిలియన్ క్లబ్బులో చేరలేదు. ఐతే వ్యక్తిగతంగా చూస్తే వరుణ్ కు ‘ఫిదా’ కంటే ‘తొలి ప్రేమ’నే ఎక్కువ పేరు తెచ్చింది. అతడి మార్కెట్ ను పెంచింది. ఆ రకంగా ఈ సినిమానే వరుణ్ కెరీర్ కు పెద్ద బూస్ట్ గా నిలిచింది.