వ‌రుణ్ తేజ్ తో ద‌బాంగ్-3 బ్యూటీ

Update: 2020-02-20 14:30 GMT
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్  `ఎఫ్-2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` చిత్రాల‌తో  బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ లందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.  తాజాగా మ‌రో చిత్రంతో హిట్టు కొట్టి హ్యాట్రిక్ హీరోగా ప్రూవ్ చేసుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. త‌న‌దైన శైలిలో డిఫ‌రెంట్ జోన‌ర్ల‌ను ట‌చ్ చేస్తూనే క‌మ‌ర్శియ‌ల్ హీరోగాను నిరూపించుకుంటున్నాడు. ప్ర‌స్తుతం బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.  కిర‌ణ్ కొర్ర‌పాటి అనే కొత్త కుర్రాడు ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ప్ర‌స్తుతం వ‌రుణ్ ముంబైలో బాక్సింగ్ లో శిక్ష‌ణ‌లో తీసుకుంటున్నాడు. పంచ్ లు విస‌ర‌డంలో ఆరితేరిన ట్రెయినర్ల స‌మ‌క్షంలో త‌ర్పీదు పొందుతున్నాడు. ఇప్ప‌టికే వ‌రుణ్ మేకొవ‌ర్ ల్ భాగంగా కొన్ని స్టిల్స్ కూడా లీక‌య్యాయి. ఆ లుక్ లో  ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్నాడు. అటు ద‌ర్శ‌కుడు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో  ఉన్నాడు. స్ర్కిప్ట్ స‌హా సాంకేతిక నిపుణ‌లు..న‌టీన‌టులు..హీరోయిన్ ఎంపిక ప‌నుల్లో  త‌ల‌మున‌క‌లై ఉన్నాడు. మ‌రీ బాక్స‌ర్ తో రొమాన్స్ చేసే భామ ఎవ‌రు?  కొత్త  మోడ‌ల్ ని దిగుమ‌తి చేస్తున్నారా? ల ఏక టాలీవుడ్ లో ఫేమ‌స్ అయిన భామ‌ని ఎంపిక చేస్తున్నారా? అన్న దానిపై కొద్ది రోజులుగా ఆస‌క్తి నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో మెగా ప్రిన్స్ కి జోడీగా బాలీవుడ్ భామ స‌యిమంజ్రేక‌ర్ ను ఎంపిక చేసిన‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మ‌డు బాలీవుడ్ లో ఫేమ‌స్ న‌టుడైన మ‌హేష్ మంజ్రేక‌ర్ కుమార్తె. తండ్రి వార‌స‌త్వాన్ని అందుకుని అమ్మ‌డు `ద‌బాంగ్ -3` తో న‌టిగా ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమా అక్క‌డ మంచి ఫ‌లితాన్నే సాధించింది. ఈ నేప‌థ్యంలో ఈ స్టార్ కిడ్ పై టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాతల క‌న్ను ప‌డింది. వ‌రుణ్ చిత్రాన్ని అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు బాబి మ‌రో యువ నిర్మాత సందీప్ తో క‌లిసి నిర్మిస్తున్నాడు. నిర్మాత‌గా బాబికిది డెబ్యూ మూవీ కావ‌డంతో సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News