వరుణ్ తేజ్ నిలబెట్టుకున్నాడు.. అదే కావాలి

Update: 2018-02-12 04:15 GMT
ఫిదాతో సెన్సేషనల్ హిట్ సాధించిన వరుణ్ తేజ్.. ఆ వెంటనే తొలిప్రేమతో కూడా మంచి విజయాన్నే ఖాతాలో వేసుకోవడం ఖాయం అని చెప్పేయచ్చు. తొలి రోజునే ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. ఫస్ట్ డేకి ఫిదాకు మించిన వసూళ్లు వచ్చాయంటే ఈ చిత్రానికి జనాలు ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్ధమవుతుంది.

ఫిదా చిత్రానికి మొదటి రోజున 4.93 కోట్ల వసూళ్లు దక్కాయి. కానీ తొలి ప్రేమ ఖాతాలో మాత్రం ఏకంగా 5.13 కోట్లు పడ్డాయి. యూఎస్ ఫస్ట్ డే వసూళ్లలో గురువారం నుంచి శనివారం వరకూ కలెక్షన్స్ కలవడంతో ఫిగర్ పెరిగింది. అయితే.. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. వరుణ్ తేజ్ ఈ విషయంలో మంచి సక్సెస్ ని సాధించగలిగాడు. ఈ యంగ్ మెగా హీరోకి తన రేంజ్ ను పెంచుకునేందుకు ప్రస్తుతం ఇదే కావాలి.

చాలామంది హీరోలు.. ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ పడినా కూడా.. తదుపరి సినిమాతో ఆ ఫీట్ చేయలేకపోతున్నారు. ఇటు పెద్ద పెద్ద స్టార్లు అయితేనేమీ అటు చిన్ని చిన్న మీడియం సైజ్ హీరోలు అయితేనేమీ.. అలాగే ఉంది పరిస్థితి. ఈ సందర్భంలో ఫిదా సినిమాతో వచ్చిన 50 కోట్ల మార్కెట్ ను ఎంతోకొంత నిలబెట్టుకోవాల్సిన ఒత్తిడి వరుణ్‌ తేజ్ మీద ఉంటుంది. ఒకవేళ పూర్తి రన్‌ లో 50 కోట్లు షేర్ తేకపోయినా కూడా.. కనీసం తొలి రోజు తొలి వీకెండ్ లలో ఆ సినిమాకు వచ్చినంత క్రేజ్ ను రిపీట్ చేస్తే మాత్రం.. తదుపరి ఏదన్నా పెద్ద కాంబినేషన్ పడినప్పుడు ఆటోమ్యాటిక్ గా ఒక డిపెండబుల్ హీరో తరహాలో.. ఒక నాని టైపులో మనోడు స్థిరపడతాడు.

ఒకవేళ ఈ 'తొలిప్రేమ' బ్లాక్ బస్టర్ అయితే మాత్రం.. మెగా ఫ్యామిలీలో బన్నీ అండ్ చరణ్‌ తరువాత.. మరో సక్సెస్ ఫుల్ యంగ్ హీరో అని చెప్పొచ్చు. చూద్దాం ఏమవుతుందో.
Tags:    

Similar News