అపోలో ఫ్యామిలీలో చేరిన వరుణ్ తేజ్

Update: 2016-08-10 05:32 GMT
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అపోలో వారికి అల్లుడు. అందుకే తన భార్య ఉపాసన కంపెనీ అయిన అపోలో సంస్థకి రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటాడు. సినిమాలో హాస్పిటల్ సీన్ వస్తే అపోలో హాస్పిటల్ చూపించడం ఇలాంటిందే. రీసెంట్ గా డిజిటల్ వెల్నెస్ ప్లాట్ ఫాం అయిన అపోలో జియాను లాంఛ్ చేయడంతో పాటు.. తనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు చరణ్. మరోవైపు కొన్ని రకాల ప్రచారాలకు చెర్రీ వైఫ్ ఉపాసన తనే స్వయంగా ప్రచారం చేసేస్తోంది.

ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో.. చరణ్ కు తమ్ముడన్నయ్య(వరుణ్ తేజ్ తనకంటే బాగా పొడగరి కావడంతో చరణ్ స్వయంగా అలా చెప్పాడు) కూడా అపోలో బిజినెస్ ఫ్యామిలీలో సభ్యుడైపోయాడు. అపోలో లైఫ్ తయారు చేస్తున్న మల్టి విటమిన్ మెన్ ట్యాబ్లెట్లకు వరుణ్ తేజ్ ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటికే వాటితో దిగిన ఫోటోలకు పోజులు కూడా ఇచ్చేసి.. మల్టీ విటమిన్ కు  బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. అయినా.. ఆజానుబాహుడు.. హ్యాండ్సమ్ హీరో వరుణ్ తేజ్ కంటే విటమిన్ ట్యాబ్లెట్స్ యాడ్ ఎవరు సరిపోతారు లెండి.

'నా కొత్త బ్రాండ్ అంబాసిడర్ వరుణ్ తేజ్. మల్టీ విటమిన్ కు వరణ్ అంబాసిడర్. కొణిదెల వరుణ్ తేజ్ లా స్ట్రాంగ్ గా ఉండాలంటే మల్టీ విటమిన్ తీసుకోండి' అంటూ ఉపాసన అప్పుడే ప్రచారం కూడా స్టార్ట్ చేసేసింది. మొత్తానికి ఫ్యామిలీ ఫ్యామిలీ అపోలో వారి యాడ్లలో మెరవబోతున్నారనమాట.
Tags:    

Similar News