రెండు సినిమాల డీల్‌ లో వ‌రుణ్‌ తేజ్?

Update: 2015-12-16 06:05 GMT
స‌క్సెస్ న‌డిపిస్తుంది ఇక్క‌డ‌. అది మొహం చాటేస్తే ఎవ‌రూ ద‌రిదాపుల్లోకి కూడా చేర‌రు. ప్ర‌స్తుతం శ్రీ‌నువైట్ల ప‌రిస్థితి అదే. ఇటీవ‌లి కాలంలో ఆగ‌డు, బ్రూస్‌లీ లాంటి డిజాస్ట‌ర్లు ఇచ్చిన ఫ‌లితం అత‌డిపై తీవ్రంగా ప‌డింది. త‌ను ఎంతో న‌మ్మిన ఢీ హీరో - రెడీ హీరో త‌న‌తో సినిమాలు చేయ‌డానికి సిద్ధంగా లేరు. పోనీ .. త‌ను ఎంతో మంది హీరోల‌కు హిట్లిచ్చి ఉన్నాడు కాబ‌ట్టి వాళ్ల‌లోంచి ఏదైనా స్పంద‌న వ‌చ్చిందా? అంటే అదీ లేదు.

అస‌లు శ్రీ‌నూని ప‌ట్టించుకునే నాధుడే లేక‌పోయే. కార‌ణం ఏదైనా ఇప్పుడు అప్ క‌మ్ హీరోలతో మ‌రోసారి నిరూపించుకుని లైమ్ లైట్‌ లోకి రావాల్సిందే. అందుకు శ్రీ‌నూ కూడా మాన‌సికంగా సిద్ధ‌మైపోయాడని చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు హీరోల‌తో సినిమాలు చేస్తున్నాడంటూ వార్త‌లొచ్చాయి. రానా ఓ అవ‌కాశం ఇస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌ లో సినిమా సెట్స్‌ కెళుతుంద‌న్న ప్ర‌చారం సాగింది. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్ర‌కారం... శ్రీ‌నువైట్ల‌తో నిర్మాత సి.క‌ళ్యాణ్ ఓ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. శ్రీ‌నూ త‌న‌కి ఓ రెండు హిట్టు సినిమాలు తీసిపెట్టాల‌న్న‌దే ఆ ఒప్పందం. ఒక‌టి హిట్ట‌యినా - ఫ‌ట్టాయినా రెండో సినిమా కూడా త‌న‌తోనే చాయాల్సిందే. అందుకు డీల్ సెట్ట‌య్యింద‌ని చెబుతున్నారు. అలాగే త‌న ప్రొడ‌క్ష‌న్‌ లోనే లోఫ‌ర్ మూవీ చేసిన వ‌రుణ్‌ తేజ్ తో మ‌రో సినిమా తెర‌కెక్కించేందుకు సి.క‌ళ్యాణ్ రెడీ అవుతున్నారు. అంటే వ‌రుణ్‌ తేజ్ హీరోగా శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మించే సినిమాకి స‌న్నాహాలు సాగుతున్న‌ట్టేన‌ని అంటున్నారు. అయితే ఈ సంగ‌తిని అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది.

నిన్న‌టి ఇంట‌ర్వ్యూలో స‌రైన కామెడీ స్క్రిప్టు త‌గిలితే న‌టించాల‌నుంది. పెద‌నాన్న చిరంజీవి అంత బాగా కామెడీ చేసి మెప్పించాలి అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే శ్రీ‌నూతో వ‌రుణ్ ఫిక్స‌వుత‌న్న‌ట్టే అనిపిస్తోంది. మ‌రి వైట్ల ద‌గ్గ‌ర ఉన్న క‌థ అస‌లు మ్యాట‌ర్‌ ని డిసైడ్ చేస్తుంది. టిల్ దెన్ వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News