కొత్త మెగా హీరోకు రెండు పండగలు

Update: 2015-07-29 13:24 GMT
ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. వింటానికి సూపర్‌ గా ఉంటుంది ఈ మాట. ఒక నటుడికి చెందిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం అంత వింత కాకపోవచ్చు, కానీ ఒకే హీరో ఇలా రిలీజ్ చేయడం మాత్రం అరుదుగా జరిగేదే. వండర్స్‌ కి మారుపేరైన సూపర్ స్టార్ కృష్ణ 80ల్లో ఇలాంటివి విచిత్రాలు చాలానే చూపించారు. ఇప్పుడు రన్నింగ్ స్టార్స్ ఇలాంటి ఘటనలు జరుగుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.

రీసెంట్‌ గా రాణా ఇలాంటి ఫీట్ సాధించాడు. బాహుబలిలో ఈయన విలనే అయినా... హీరోకు ధీటుగా కేరక్టర్ ఉంటుంది. ప్రమోషన్స్‌ లో కూడా బాగా యాక్టివ్‌ గా పాల్గొన్నాడు ఈ దగ్గుబాటి వారసుడు. త్రీడీ రుద్రమదేవి లో కూడా... రాణా చాలా ఇంపార్టెన్స్ ఉన్న కేరక్టర్ చేస్తున్నాడు. రెండింటికీ ప్రమోషన్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది ఇతగాడికి.  ఇప్పుడిలాంటి పరిస్థితే వచ్చింది ఓ మెగా వారసుడికి. ముకుందతో పరిచయమైన వరుణ్ తేజ కూడా... రెండు సినిమాలు సేమ్ టైంలో రిలీజ్ చేయబోతున్నాడు. క్రిష్ డైరెక్షన్‌ లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా కంచె. ఈ మూవీ ఆగస్ట్‌ లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఇక పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో కుర్రమెగా హీరో చేస్తున్న సినిమా లోఫర్. పూరీ ఏ స్పీడ్‌ లో తీస్తాడో తెలుసుగా. స్టార్స్‌ తోనే నిండా 3 నెలలు పట్టదు. మరి కొత్త హీరోతో జూన్‌ లో మొదలుపెట్టిన ఈ మూవీ షూటింగ్‌ ని 2 నెలల్లోనే ముగించేయబోతున్నాడు. అంటే ఆగస్ట్ చివరకు లోఫర్ కూడా రెడీగానే ఉంటుందన్నమాటల.

ఇప్పుడు ఈ రెండింటి ప్రమోషన్ బాధ్యతలను... యువ హీరో మోయాల్సిందే. కష్టమే కానీ.. ఇలాంటి ఛాన్స్ కెరీర్ మొత్తంలో మళ్లీ రాకపోవచ్చు వరుణ్ తేజ్‌కి. సరిగా ప్లాన్ చేసుకుంటే.. స్టార్ అయ్యేందుకు ఇతగాడికి ఇది లక్కీ ఛాన్సే.
Tags:    

Similar News