ఒక మెగా హీరో, రెండు డిఫరెంట్‌ గెటప్స్‌

Update: 2015-08-21 16:03 GMT
వరుణ్‌ తేజ్‌ ఆలోచనల్లో వైవిధ్యం కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది. ఒకసారి ఒకలా కనిపిస్తే, ఇంకోసారి అంచనాలకు అందనంత కొత్తగా కనిపిస్తున్నాడు. ముకుందలో సాఫ్ట్‌ నేచుర్‌ ఉన్న హార్డ్‌ వేర్‌ కుర్రాడిలా కనిపించాడు. తెలివిగా ఆలోచిస్తూనే, అవసరమైన చోట మొత్తేసే టైపు అనిపించాడు. ఇప్పుడు కంచె పోస్టర్‌, ట్రైలర్‌ చూస్తుంటే అతడు 1940 నాటి కుర్రాడిలా చాలా బుద్ధిగా ఉన్నాడు. పక్కపాపిడి తీసి, బెల్‌ ఫ్యాంటు తొడిగి .. అరే భళేగా ఉన్నాడే అనిపించాడు. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్టు తో క్రిష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇకపోతే పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోని సినిమా ఇప్పటికే స్వింగులోకి వచ్చింది. అతడి దర్శత్వంలో వరుణ్‌ తేజ్‌ పూర్తిగా మాస్‌ అవతార్‌ లో కనిపించనున్నాడని అర్థమవుతోంది. లోఫర్‌ కొత్త లుక్‌ ఒకటి బైటికి వచ్చింది. వరుణ్‌ తేజ్‌ రాజస్థాన్‌ లో సాంగ్‌ షూట్‌ లో ఉన్నాడిప్పుడు. అక్కడ  చిన్నారులతో కలిసి ఓ ఫోటో దిగాడు. ఒక బ్రౌన్‌ కలర్‌ జర్కిన్‌ తొడుక్కుని చిన్నారులతో కలిసి ఫోజులిచ్చాడు. ఇందులో చాలా స్టయిలిష్‌ గా కనిపిస్తున్నాడు. ఆ ఫోటో ఇప్పుడు నెట్‌ లో హల్‌ చల్‌ చేస్తోంది.

కంచె పోస్టర్లు, లోఫర్‌ ఫోటోలు చూస్తుంటే వరుణ్‌ ఆలోచనల్లో వైవిధ్యం తెలిసొస్తోంది. అతడు దర్శకుల్ని తెలివిగా ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడని అర్థమవుతోంది.
Tags:    

Similar News