వీడియో: గాల్లో రౌడీ ఒళ్లు గ‌గుర్కొడిచే విన్యాసం

Update: 2019-11-30 04:35 GMT
బంగీ జంప్ .. అంటే గుండె ధైర్యం ఉంటేనే సాధ్యం. ఎంతో ఎత్త‌యిన ప‌ర్వ‌తాల మీంచి.. హెలీకాఫ్ట‌ర్ల‌లోంచి దూకేస్తూ సాహ‌సికులు చేసే విన్యాసాలు గ‌గుర్పొడుస్తాయి. ఇన్నాళ్లు ఇలాంటివి సినిమాల్లోనే చూశాం. కానీ రియ‌ల్ గా చేసిన హీరోని చూసింది త‌క్కువే. కానీ ఇప్పుడు రౌడీ గారు చేసిన ఈ బంగీ జంప్ చూస్తే వామ్మోవ్! అన‌కుండా ఉండ‌లేరు. అందుకేగా అత‌డిని రౌడీ హీరో అని పిలిచేది.

మ‌న హీరోలు ఏదో సీన్ కోసం బంగీ జంప్ చేసిన‌ట్టు చూపిస్తేనే అబ్బో అదో అద్భుతం అనుకున్నాం. ఈ రియ‌ల్ ఫీట్ చూశాక అంత‌కుమించి ఫీల‌వుతాం. రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఏ ఇత‌ర‌ టాలీవుడ్ హీరోతో పోల్చినా విభిన్న‌మే. తాజాగా రౌడీ గారు చేసిన ఫీట్ సోష‌ల్ మీడియాతో పాటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. విదేశాల్లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన స్కైడైవింగ్  చేసిన విజ‌య్ నిమిషం పాటు గాల్లో ప‌ల్టీలు కొట్ట‌డం అభిమానుల‌తో పాటు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఒళ్లు గ‌గుర్పొడిచే విన్యాసాల‌కు సంబంధించిన విజ‌య్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. హెలీకాప్ట‌ర్ నుంచి సేఫ్టీ జాకెట్ తో పాటు సేఫ్టీ ట్రైన‌ర్ స‌హాయంతో బ‌య‌ట‌కి దూకేసిన విజ‌య్ నిమిషం పాటు గాల్లో చ‌క్క‌ర్లు కొట్ట‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. గాల్లో స్కైడైవింగ్ ఫ‌ల్టీలు అంటే అరివీర సాహ‌స‌మే. అందుకే ఈ వీడియో నిమిషాల్లోనే వైర‌ల్ గా మారింది. ప్ర‌తి విష‌యంలోనూ ఓపెన్ గా ఉండే విజ‌య్ దేవ‌ర‌కొండ ఏ సాహ‌సానికైనా వెన‌కాడ‌డం లేదు. ఇలాంటి అరుదైన‌ ఫీట్ చేసిన ఏకైక స్టార్ గా రికార్డుల‌కు ఎక్కేశాడు మ‌రి. ఈ ఫీట్ మ‌న‌ స్టార్ హీరోల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.


Full View

Tags:    

Similar News