టీజర్ టాక్: వాళ్ళు రాలేదంటున్న రోహిత్!

Update: 2018-08-20 04:07 GMT
డిఫరెంట్ కాన్సెప్ట్స్ - డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ నారా రోహిత్ ఒక ప్రత్యేకమైన పంథాలో ముందు వెళ్తున్నాడు.  సక్సెస్ - ఫెయిల్యూర్ల సంగతిపక్కన పెడితే ఈ విషయం లో మాత్రం రోహిత్ కు చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు తాజాగా 'వీర భోగ వసంత రాయలు' సినిమాతో మన ముందుకు రానున్నాడు. కల్ట్ ఈజ్ రైజింగ్ అనేది ఈ సినిమా క్యాప్షన్.  ఈ సినిమా టీజర్ ఈరోజే రిలీజ్ అయింది.

ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కో మతానికి సంబంధించిన భక్తులను, ప్రార్థనా మందిరాలను  - ఆ మతాలకు సంబంధించిన చిహ్నాలను చూపిస్తూ బ్యాక్ గ్రౌండ్ లో నారా రోహిత్ వాయిస్ వినిపిస్తూ ఉంతుంది. రోహిత్ ఇలా చెప్తూ ఉంటాడు. "నాకు తెలుసు మీరు వాళ్ళ రాక కోసం ఎన్ని పూజలు ప్రార్థనలు చేస్తున్నారో అని.  నాకు తెలుసు మీరు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఎలాగైనా వస్తారని.  ఎందుకంటే మీలాగా  ఎదురు చూసే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి. ఎదురు చూశాం.. ఎదురు చూశాం.. క్షణాలు కాదు.. నిముషాలు కాదు.. గంటలు కాదు.. రోజులు కాదు.. నెలల తరబడి ఎదురు చూశాం.  కానీ వాళ్ళు మాత్రం తిరిగి రాలేదు. సో.. టుడే వీ నీడ్ టు బ్రేక్ ద సైలెన్స్.  టుడే వీ నీడ్ తో మేక్ సెన్స్. టుడే వి నీడ్ టు గెట్ ప్రాక్టికల్."

ఈ డైలాగ్ తర్వాత పోలీసుల ఎటాక్ చూపించారు. షాట్ కట్ చేస్తే ఫైనల్ గా చిరు జల్లులు పడుతూ ఉంటే డిమ్ లైట్ లో ఒక గుర్రం మీద బ్లాక్ డ్రెస్ లో షాడో లా ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు.   మతాలు.. నమ్మకాలు అని హిట్స్ ఇచ్చి ఫైనల్ గా 'గెట్ ప్రాక్టికల్' అంటున్నారు కాబట్టి దొంగ గురూజీలు - మూఢ భక్తుల నేపథ్యంలో కొత్తగా ఏదో ట్రై చేసినట్టుగా ఉంది. ఓవరాల్ గా టీజర్ చూస్తుంటే మాత్రం ఇదో కొత్త కాన్సెప్ట్ సినిమా అనే ఫీల్ వస్తోంది.  నారా రోహిత్ తో పాటు శ్రీ విష్ణు - సుదీర్ బాబు - శ్రియ శరణ్ లు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు.  R ఇంద్రసేన ఈ సినిమాకు డైరెక్టర్.

ఇంకా ఎందుకు ఆలస్యం.. టీజర్ పై ఓ లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News