ఎట్టకేలకు మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కొత్త యేడాది ఆరంభంలోనే ఆ సినిమా పటట్టాలెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం కథానాయిక - ఇతర నటీనటులు - సాంకేతిక నిపుణులు - లొకేషన్లని ఎంపిక చేసుకొనే పనిలో ఉంది చిత్రబృందం. అలాగే సినిమా పేరు గురించి కూడా పెద్దయెత్తున కసరత్తులు జరుగుతున్నాయి. కథ రీత్యా సినిమాకి బంగారుబాబు అనే పేరు పెట్టాలనుకొన్నారట. కానీ ఆ పేరు మరీ ఓల్డ్ గా ఉందని ఇప్పుడు చిత్రబృందం మరో పేరును ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
వెంకటేష్ మాత్రం కథకు తగ్గట్టుగా ఏది సరిపోతే అదే పెట్టండని చెబుతున్నాడట. కానీ అభిమానుల నుంచీ, మారుతి కాంపౌండ్ వర్గాల నుంచి పేరు మరీ ఓల్డ్ గా ఉంది కాబట్టి కాస్త జోష్ ఉన్న పేరే పెట్టాలన్న డిమాండ్లు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. మారుతి కూడా అదే అభిప్రాయంలోనే ఉన్నాడట. అందుకే ఇప్పుడు కొత్త పేరుని అన్వేషించడంలో ఉన్నట్టు తెలుస్తోంది. కథానాయికగా కూడా ఇప్పటికే నయనతారని ఎంచుకోవాలని చిత్రబృందం డిసైడైనట్టు తెలిసింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నయన్ ఒప్పుకొంటుందా లేదా అన్నది డౌటే. ఆమె తమిళంలో హిట్లమీద హిట్లు కొడుతూ వరుసగా అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. రెండు మూడు రోజుల్లోనే నయనతార అభిప్రాయాన్ని తెలుసుకొని కథానాయిక గురించి ఓ నిర్ణయానికొచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు మారుతి స్నేహితులు కొద్దిమంది కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం.