వెంకీ అండ్ రానా.. ఆ రీమేక్ లోనా??

Update: 2017-07-31 05:57 GMT
ఇప్పుడు వస్తున్న సినిమా కథలలో ఒక హీరోకి కథ ఉండటమే కష్టమైపోతుంది. మరి అలాంటి అప్పుడు ఇద్దరు హీరోలు పెట్టి సినిమా తీయాలి అంటే ఈ సినిమాలో గొప్ప కథే ఉండితీరాలి. ఇప్పుడు కథలు అంటే ఒక లక్ష్యం కోసం హీరో పోరాడటం కాదు తన లాంటి మరో మనిషితో పోరాడటం. అలా అయితేనే కదా ఆ సినిమా కానీ ఆ హీరోకి కానీ ఇమేజ్ పెరిగేది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు కొంచం ఎక్కువగానే వస్తున్నాయి. ఇలాంటి కథతోనే ఒక తమిళ్ సినిమాను తెలుగులోకి  రీమేక్ చేయబోతున్నారట మన హీరోలు. ఇక్కడ అసలు విషయం ఏంటి ఏంటి అంటే ఆ ఇద్దరు హీరోలు ఒకే కుటంబానికి చెందిన హీరోలు.

రానా దగ్గుబాటి హీరో అయినప్పటి నుండి అందరి ఆలోచన ఒక్కటే... బాబాయ్ వెంకటేష్ అండ్ రానా కలిసి సినిమా ఎప్పుడు చేస్తారనే. ఈ ప్రశ్నకు వాళ్ళిద్దరి సమాధానం ఒక్కటే మంచి కథ దొరకాలి కదా అని. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు దొరికినట్లే కనిపిస్తుంది. ‘విక్రమ్ వేధ’  అనే ఒక తమిళ్ సినిమా ఈ మధ్యనే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగు లోకి రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తుంది. ఇండస్ట్రి టాక్ ప్రకారం “రానా వెంకటేష్ కలిసి ఎప్పటి నుండో కలిసి పని చేయాలిని చూస్తున్నారు. కానీ ఇద్దరకి సరిపోయే కథలు రాకపోవడంతో ఆ ఆలోచనను మానుకొన్నారు. ఈ తమిళ్ సినిమా మొదలుకాకముందు నుంచే విక్రమ్ వేధ డైరెక్టర్లు పుష్కర్, గాయత్రి తో ఒక కథ అనుకున్నారు అని తెలుస్తుంది. కానీ అవి ఏవి ఒక నిద్దరణకు రాకపోవడం తో వీళ్ళ ఆలోచన ముందుకు సాగలేదు.”

ఈ తమిళ్ సినిమాలో మాధవన్ ఒక ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించాడు, విజయ్ సేతుపతి ఏమో లోకల్ గ్యాంగ్ స్టార్ గా కనిపించాడు. మరి ఒకసారి ఆలోచించండి వెంకీ మళ్ళీ కాకి చొక్కా వేసుకొని కనిపిస్తే అది కూడా రానా తో తలపడితే ఎలా ఉంటుందో. ఇక్కడ మరో విషయం చెప్పాలి ఈ తమిళ్ సినిమా నిర్మాత గతంలో ‘ఇరుధు సుతృ’ (గురు) సినిమాను నిర్మించారు.​
Tags:    

Similar News