దర్శకుడు తేజ తన కెరీర్ లో మొదటిసారి విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ తర్వాత అవకాశాలను కాచి వడబోసి వెంకటేష్ బాలకృష్ణ సినిమాలు ఎంచుకుని విచిత్రంగా ఒకదాని తర్వాత ఒకటి డ్రాప్ అయ్యే దాకా తెచ్చుకున్నాడు. తొలుత వెంకటేష్ సినిమా ఏవో అంతర్గత కారణాల వల్ల సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదని తేలడంతో అది పక్కన పెట్టేసి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్ మీదే పూర్తి దృష్టి కేంద్రీకరించాలి అనుకున్నాడు. కాని సృజనాత్మక విబేధాలు ఏవో వచ్చాయనే కారణంతో దాన్నుంచి కూడా బయటకు రావలసి వచ్చింది. మరి తేజ తర్వాత ఏ సినిమా చేస్తాడా అని ఎదురు చూస్తున్న వాళ్ళకు సమాధానం దొరికేసింది. తిరిగి వెంకటేష్ సినిమాకే తేజ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. సురేష్ బాబు మళ్ళి రమ్మని చెప్పి మరోసారి స్క్రిప్ట్ ఫైనల్ చేయవలసిందిగా సూచించినట్టు తెలిసింది.
షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ సినిమాకు చాలా వర్క్ జరిగింది. కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ చేసారు. నారా రోహిత్-ఈశా రెబ్బాను మరో జంటగా తీసుకుని వెంకీ పక్కన శ్రేయతో సైన్ కూడా చేయించుకున్నారు. ముగ్గురు రచయితలతో తేజ స్క్రిప్ట్ ను వివిధ దశల్లో మేధో మదనం చేయించాడు. ఇంతా జరిగాక ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది వార్తల్లో ఉన్నంత కాలం ఆటా నాదే వేటా నాదే అనే వర్కింగ్ టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. మరి అదే స్క్రిప్ట్ ని కొనసాగిస్తారా లేక ఏదైనా మార్పులతో కొత్తగా ఏమైనా చేయబోతున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే వెంకటేష్ ఫాన్స్ కి మాత్రం ఒక డౌట్ మైండ్ ని తొలిచేస్తోంది.
వెంకటేష్ రెండు మల్టీ స్టారర్స్ కి గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చాడు. వరుణ్ తేజ్ తో కలిసి దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిపోయింది. రేపో ఎల్లుండో స్టార్ట్ చేసేలా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి వెంకటేష్ నటించే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ పడింది. దానికి కూడా తెరవెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు తేజది మళ్ళి పట్టాలు ఎక్కింది కనక ఏది ముందు ఏది తర్వాత అనే సందేహం కలగడం సహజం. దీనికి వెంకీ నుంచి సమాధానం ఆశించడం న్యాయం.