విక్టరీ వెంకటేష్- మారుతి కాంబినేషన్ లో సినిమా అనగానే ఇండస్ట్రీ జనాల్లోనే కాదు.. ఆడియన్స్ లో కూడా ఆసక్తి జనరేట్ అయింది. సక్సెస్ మెషీన్ టైపులో దుసుకుపోతున్న నయనతార హీరోయిన్ గా నటించడంతో బాబు బంగారంపై ఇంట్రెస్ట్ మరింతగా పెరిగింది.
అయితే.. తొలి రోజునుంచే బంగారానికి మిక్సెడ్ టాక్ వచ్చింది. రివ్యూలు అయితే కంటెంట్ విషయంలో తీసిపడేశాయ్. ఇప్పుడు బాబు బంగారం తొలి వీకెండ్ పూర్తి చేసుకుంది. మౌత్ టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్స్ విషయంలో వెంకీ సత్తా చాటాడనే చెప్పాలి. బాబు బంగారానికి వీకెండ్ ముగిసేనాటికి 15 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు దక్కాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్ వెర్షన్.. రెస్టాఫ్ ఇండియా.. ఓవర్సీస్ లలో కలిపి ఈ మొత్తం సాధ్యమైంది. సోలో హీరోగా వెంకటేష్ కి ఇదే అత్యధిక కలెక్షన్స్ అందించిన సినిమా ఇదే. అంచనాలు బాగుండడం.. అడ్వాన్స్ బుకింగ్ లు.. వరుసగా సెలవలు రావడం బాగానే కలిసొచ్చింది.
సోమవారం ఇండిపెండెన్స్ డే హాలీడే కావడంతో ఆ రోజు కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయినా.. ఆ తర్వాత సీన్ ఏంటనేదే ప్రశ్నార్ధకం. బాబు బంగారంను 30 కోట్లు కలెక్ట్ చేస్తే సేఫ్ ప్రాజెక్ట్ అనాలి. ఇప్పటికి సగం మొత్తం వచ్చేశాయి, ఇంకో సగం రాబట్టాల్సి ఉంటుంది. వీకెండ్ పరీక్ష వరకు వెంకీ పాస్ అయ్యాడు. మరి ఫైనల్ ఎగ్జామ్ సంగతి తెలియాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.