విక్టరీ వెంకటేష్ - నాగచైతన్య కథానాయకులు గా నటించిన `వెంకీ మామ` ఈనెల 13న సోలోగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. కాంపిటీషన్ ఏదీ లేకుండా డి.సురేష్ బాబు బృందం సోలో రిలీజ్ ని ప్లాన్ చేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద `వెంకీ మామ` స్పీడ్ ఎంత? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. మొదటి రోజు మోర్నింగ్ ఆటకే తెలుగు రాష్ట్రాల్లో టాక్ స్ప్రెడ్ అవుతుంది. అయితే దానికంటే ముందే అమెరికా ప్రీమియర్ల నుంచి టాక్ బయటకు వస్తుంది. అమెరికాలో అక్కడ కాలమానం ప్రకారం రేపు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు తొలి ప్రీమియర్ పడుతోంది. ఇండియాలో మిడ్ నైట్ 12.30 గంటలకు అమెరికా ప్రీమియర్ రిపోర్ట్ వస్తుందన్నమాట.
ఈ ప్రీమియర్ తోనే సినిమాలో మ్యాటర్ ఎంత అన్నది బయటపడుతుంది. అయితే వెంకీ ఈసారి కూడా `ఎఫ్ 2` మ్యాజిక్ ని రిపీట్ చేయాలనే కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టే కనిపిస్తోంది. `ఎఫ్ 2`కి అప్పట్లో అమెరికా ప్రీమియర్ల నుంచే మంచి టాక్ వచ్చింది. అది ఇండియాలో కలెక్షన్స్ పరంగా సాయమైంది. `ఎఫ్ 2`కి పాజిటివ్ టాక్ కలిసొచ్చింది. `వెంకీ మామ` డే వన్ టాక్ ఎలా ఉంది? అన్నదే ఫేట్ డిసైడ్ చేయనుంది.
మామా అల్లుళ్ల మధ్య కెమిస్ట్రీ ఎంతగా వర్కవుటైతే అంత పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే కశ్మీర్ ఎపిసోడ్స్ .. చైతూ ఆర్మీ క్యారెక్టర్ వర్కవుటైనా ప్లస్ అవుతుంది. ఇక వెంకీ బ్రాండ్ పెర్ఫామెన్స్ సినిమాకి అస్సెట్ అవుతుందనడంలో సందేహం లేదు. వెంకీమామ సమీక్ష మరికొన్ని గంటల్లోనే.. ఇక్కడ చదవొచ్చు..